News December 1, 2025
కాకినాడలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 వరకు కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీల పురోగతి, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 13, 2026
BREAKING: చౌటుప్పల్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 20 వార్డులకు గాను 13 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 3 బీజేపీ, 1 సీపీఎం గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
News February 13, 2026
రామగుండం: ‘రెండు’ ఓట్ల తేడాతో ఘన విజయం!

రామగుండం కార్పొరేషన్ 59వ డివిజన్‌లో ఉత్కంఠ పోరు ముగిసింది. ఏఐఎఫ్‌బీ అభ్యర్థి బాలసాని తిరుపతి కేవలం 2 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఖాజా సనాకు 768 ఓట్లు రాగా, తిరుపతికి 770 ఓట్లు వచ్చాయి. పోటాపోటీగా సాగిన ఈ పోరులో రీకౌంటింగ్ నిర్వహించగా, చివరకు తిరుపతిని విజయం వరించింది. దీంతో ఆయన అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు.
News February 13, 2026
‘అనంత బాలోత్సవం’ బ్రోచర్ ఆవిష్కరణ

అనంతపురంలోని SSBN కళాశాలలో ఈనెల 21, 22వ తేదీల్లో జరగనున్న ‘6వ అనంత బాలోత్సవం’ పోస్టర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ బాబు ఆవిష్కరించారు. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేశ్, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.


