News December 1, 2025

కాకినాడ అభివృద్ధి కోసం గళమెత్తండి MP సారూ..!

image

కాకినాడ జిల్లా అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. పోర్ట్ విస్తరణ, కోటిపల్లి-నర్సాపురం రైల్వే, గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఉప్పాడ తీర రక్షణ, అమృత్‌ జల జీవన్ నిధుల విడుదల అత్యవసరమని ప్రజలు అంటున్నారు. కాకినాడ ఇండస్ట్రియల్ కారిడార్, ఆయిల్‌ గ్యాస్ ప్రాజెక్టుల విస్తరణ వంటి సమస్యలపై ఎంపీలు ఉదయ్, సతీష్ పార్లమెంట్‌లో గళమెత్తాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News February 7, 2026

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి: ఎస్పీ జానకి షర్మిల

image

పోలీసులు ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన వీక్లీ పరేడ్‌లో మాట్లాడారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి శాఖ ప్రతిష్ఠను కాపాడాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కుటుంబంతో గడపాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

News February 7, 2026

ఆరోగ్యంగా ఉంటేనే విధుల్లో రాణించగలరు: ఎస్పీ

image

పోలీసులకు విధి నిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్య పరిరక్షణ, క్రమశిక్షణ, ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యమని ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన వీక్లీ పరేడ్‌లో మాట్లాడారు. సిబ్బంది సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాలని, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలన్నారు. ఫిట్నెస్‌తోనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలమని, మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

News February 7, 2026

నిర్మల్: సీనియర్ లీడర్స్ ఫుల్ యాక్షన్ మోడ్!

image

నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో సీనియర్ నాయకులు ప్రచార వేగాన్ని పెంచారు. వార్డు స్థాయిలో సమావేశాలు, కార్యకర్తలతో సమన్వయం, ఇంటింటి ప్రచారం ద్వారా అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. అభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. పార్టీ వర్గాలు ఈ ప్రచారం ఫలితాలపై సానుకూలంగా స్పందిస్తున్నాయి. అయితే స్థానిక సమస్యలు, ప్రత్యర్థుల వ్యూహాలు కూడా ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.