News March 15, 2025

కాకినాడ: ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

image

ఓ తండ్రి కసాయిగా మారాడు. ఇద్దరు పిల్లల్ని క్రూరంగా చంపి తాను చనిపోయాడు. పిల్లలు చదవడం లేదని కాకినాడ రూరల్‌లో ఉంటున్న చంద్రకిషోర్ (37) హోలీ సంబరాలు కుటుంబంతో చేసుకున్నాడు. భార్యను వదిలేసి పిల్లలతో ఇంటికి వచ్చాడు. జోషిత(7), నిఖిల్ (6)ని తండ్రి ఇంటికి తీసుకొచ్చి బకెట్లో తలలు ముంచి దారుణంగా చంపేశాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లల కోసం ఇంటికి వచ్చిన భార్య ఆ ఘటన చూసి నిర్ఘాంత పోయింది.

Similar News

News February 12, 2026

పార్లమెంట్‌లో ఏపీ అభివృద్ధిపై ‘సానా, ఉదయ్’ ప్రశ్నలు

image

కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ పార్లమెంట్ వేదికగా ఏపీ అభివృద్ధి కోసం పోటీపడుతున్నారు. వీరిద్దరూ కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ సమస్యలపై నిత్యం గళమెత్తుతూ, వివిధ ప్రశ్నల సందిస్తున్నారు. అభివృద్ధి విషయంలో వీరిద్దరిదే పైచేయిగా ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఉభయ సభల్లోనూ రాష్ట్ర ప్రయోజనాల కోసం వీరు సాగిస్తున్న పోరాటం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

News February 12, 2026

నేడు కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం

image

మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కొల్లు రవీంద్ర, బుద్ధప్రసాద్, బోడె ప్రసాద్, వెంకట్రావు, రాము, కృష్ణప్రసాద్, కుమార్‌ రాజా పాల్గొననున్నారు. కృష్ణా జిల్లా అభివృద్ధి, నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. జిల్లాలో చేపట్టాల్సిన ప్రాధాన్య ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధిపై సమీక్ష జరగనుంది.

News February 12, 2026

ఆన్‌లైన్‌లో వేప పుల్లలు.. రూ.2వేల పైనే!

image

మన దగ్గర ఉచితంగా లభించే ఎన్నో ప్రొడక్ట్స్‌ను ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తుంటాం. అందులో ‘వేప పుల్ల’ ఒకటి. అమెజాన్ వంటి షాపింగ్ సైట్స్‌లో 20 పుల్లలకు రూ.160వరకు ఉంటోంది. అదే అమెరికా వంటి దేశాల్లో వీటిని రూ.2వేల వరకూ విక్రయిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన జీవనశైలిలో భాగంగా చాలామంది వేపపుల్ల వైపు మళ్లుతున్నారట. వేపలోని సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్ గుణాలు చిగుళ్లను దృఢపరుస్తాయి.