News November 16, 2025

కాకినాడ కలెక్టరేట్‌లో రేపు PGRS

image

కాకినాడ కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ షాన్‌మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమానికి రాలేనివారు ఆన్‌లైన్‌లో కూడా తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News January 19, 2026

అనంత జిల్లా స్థాయి పోటీలు

image

జూనియర్, సీనియర్ విభాగాలలో అనంత జిల్లా స్థాయి మట్టి కుస్తీ పోటీలు (మల్ల యుద్ధం) మంగళవారం 20వ తేదీన పామిడిలోని అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్లో జరగనున్నాయి. క్రీడాకారులు మంగళవారం ఉ. 9:00 గంటలకు హాజరుకావాలని జిల్లా కార్యదర్శి ఎన్. వాణి, జిల్లా కోచ్ రాఘవేంద్ర, ఆర్మీ ఎన్ సెక్రటరీ నక్కల రామాంజనేయులు తెలిపారు. వచ్చే క్రీడాకారులందరూ ఆధార్ కార్డు, మూడు ఫొటోలు, బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు.

News January 19, 2026

వనపర్తి: ప్రేమ పెళ్లి విషాదాంతం.. యువకుడి సూసైడ్

image

ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI స్వాతి వివరాలు మేరకు.. వనపర్తి(D) అమరచింత వాసి వడ్డే నరసింహ (21) అదే కాలనీకి చెందిన అమ్మాయిని 20 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. యువకుడికి పొలం, జాబ్ లేకపోవడంతో భార్యను పోషించలేడని 6 నెలల్లో ఎంతో కొంత సంపాదిస్తే తామే పెళ్లి చేస్తామని అనిత ఫ్యామిలీ నమ్మబలికి ఆమెను తీసుకెళ్లింది. భార్య దూరం కావడంతో నరసంహ ఉరేసుకున్నాడు.

News January 19, 2026

ప.గో: హీరో నవీన్ పోలిశెట్టి సందడి

image

ఉమ్మడి ప.గో. జిల్లా ఏలూరులో ఆదివారం ‘అనగనగా ఒక రాజు’ మూవీ టీమ్ సందడి చేసింది. చిత్రం విజయోత్సవ సంబరాల్లో భాగంగా హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షీ చౌదరి ఏలూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా పడమర వీధి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సినిమా ప్రదర్శన అవుతున్న థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో కాసేపు సరదాగా గడిపారు.