News May 23, 2024

కాకినాడ: పెళ్లికి వెళ్లొస్తూ కాలువలో వ్యక్తి గల్లంతు

image

కాకినాడ జిల్లా రౌతులపూడి శివారులో ఏలేరు ఎడమ కాలువలో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన సీకోలు వీరబాబు అదే గ్రామానికి చెందిన పలువురితో కలిసి రౌతులపూడిలో ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం ఏలూరు ఎడమ కాలువలో స్నానానికి దిగగా.. వీరబాబు గల్లంతయ్యాడని దుర్గాడ గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News

News March 13, 2026

రాజమండ్రిలో అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్

image

చర్లపల్లి-కామాఖ్య అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తూర్పుగోదావరి జిల్లా కనెక్టివిటీ లభించింది. ఈ రైలు శుక్రవారం మార్చి 13 నుంచి రాజమండ్రి స్టేషన్‌లో ఆగనుంది. చర్లపల్లి, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, దువ్వాడ, విజయనగరం జంక్షన్ వంటి నగరాలను ఈ రైలు అనుసంధానిస్తోంది. దీనివల్ల జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం పెరగడంతో పాటు కామాఖ్య ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యం కలగనుంది.

జాతీయ టీటీ పోటీలకు రాజమండ్రి వైష్ణవి సూర్య ఎంపిక

image

ఇండోర్‌లో మార్చి 14 నుంచి 21 వరకు జరగనున్న 87వ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలకు రాజమండ్రి క్రీడాకారిణి వై. వైష్ణవి సూర్య ఎంపికయ్యారు. ర్యాంకింగ్ పోటీల పాయింట్ల ఆధారంగా రాష్ట్ర సీనియర్ మహిళల జట్టులో ఆమె చోటు దక్కించుకున్నారు. గురువారం జిల్లా టీటీ అసోసియేషన్ అధ్యక్షుడు జెవీవీ అప్పారెడ్డి, కోశాధికారి కె.సత్యనారాయణ, కోచ్ సుబ్బారావు ఆమెను అభినందించారు.