News November 19, 2025

కాకినాడ: ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

కాకినాడ టౌన్ నుంచి బెంగళూరు వరకు నడిచే శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు అత్యాధునిక లింక్ హాఫ్‌మన్ బుష్ (LHB) కోచ్‌లను అమర్చనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఈ ఎల్‌హెచ్‌బీ బోగీలు జనవరి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడున్న ఐసీఎఫ్ బోగీలతో పోలిస్తే, ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు మరింత సౌకర్యవంతంగా, గరిష్టంగా 160 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News January 23, 2026

సంచలనం.. ట్రంప్ మళ్లీ పోటీ చేస్తారా?

image

తన మాటలు, చేతలతో వివాదాలు రేపుతున్న ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ‘నేను నాలుగో సారి పోటీ చేయాలా?’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘TRUMP 2028, Yes’ అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. US రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా 2సార్లు పని చేయడానికే ఛాన్స్ ఉంది. 3సార్లు పోటీ చేసిన ట్రంప్ 2సార్లు గెలిచారు. మరి నాలుగోసారి పోటీకి తమ రాజ్యాంగాన్ని సవరిస్తారా?

News January 23, 2026

పాలనకు డిజిటల్ వ్యవస్థలు కేంద్రబిందువులు: లోకేశ్

image

AP: ఎలక్ట్రానిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్‌కు రాష్ట్రం గమ్యస్థానమని మంత్రి లోకేశ్ తెలిపారు. APకి 160GW పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఉందన్నారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, డీ-గ్లోబలైజేషన్ ప్రాముఖ్యత సంతరించుకున్నాయని, పాలనకు డిజిటల్ వ్యవస్థలు కేంద్రబిందువులుగా మారాయని తెలిపారు. నాణ్యమైన కరెంట్ ఇవ్వకుంటే డేటా సెంటర్లు, AI కంప్యూట్ రంగాలను విస్తరించలేమని దావోస్ రెన్యూ పవర్ మీటింగ్‌లో చెప్పారు.

News January 23, 2026

హనుమకొండ: కొడుకులు సాకడం లేదని ఊరికి ఆస్తి రాసిచ్చేశాడు

image

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్‌పేట గ్రామంలో ఓ వ్యక్తి తన భూమిని గ్రామపంచాయతీకి దానం చేశారు. వివరాల్లోకెళ్తే.. గ్రామానికి చెందిన పురోహితులు నాగిళ్ల వెంకటేశ్వర్‌కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు. ముసలి ప్రాయంలో ఉన్న తనను ఏ కొడుకు కూడా పట్టించుకోవడం లేదని, తన బాగోగులు గ్రామస్థులు చూసుకుంటున్నందుకు తన పేరిట ఉన్న 4.38 ఎకరాల భూమిని గ్రామానికి దానం చేస్తున్నట్లు గ్రామపెద్దల సమక్షంలో రాసిచ్చారు.