News November 5, 2025

కాకినాడ: మూడు రోజుల్లో వస్తా అన్నారు.. ఇంకా రాలేదే..!

image

గత నెల 9న ఉప్పాడలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా మూడు రోజుల్లో తిరిగి ఇక్కడికి వచ్చి, కాకినాడ నుంచి కోనపాపపేట వరకు బోటులో పర్యటించి కాలుష్య జలాలను పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దాదాపు నెల రోజులు కావస్తున్నా పర్యటనకు రాకపోవడంతో యూ.కొత్తపల్లి మండల మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “డిప్యూటీ సీఎం గారు రండి, ఒక్కసారి కాలుష్యం చూడండి” అని వారు కోరుతున్నారు.

Similar News

News January 17, 2026

గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో హార్వర్డ్ డౌన్

image

2025 గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ మూడో స్థానానికి పడిపోయింది. నెదర్లాండ్స్‌కు చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ విడుదల చేసిన జాబితాలో చైనా విశ్వవిద్యాలయాలే ఎక్కువగా ఉన్నాయి. జెజియాంగ్ వర్సిటీ తొలి స్థానం, షాంఘై జియావో రెండో స్థానంలో నిలిచాయి. టాప్ 10లో 8 వర్సిటీలు చైనావే కావడం విశేషం. భారత విశ్వవిద్యాలయాలు టాప్ 100లో చోటు దక్కించుకోలేకపోయాయి.

News January 17, 2026

ముక్కనుమ రోజు మాంసాహారం తినవచ్చా?

image

భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్లో శాకాహారానికే ప్రాధాన్యతనిచ్చే ప్రజలు నాలుగో రోజైన ముక్కనుమ నాడు మాంసాహారాన్ని ఇష్టంగా వండుకుంటారు. అందుకే దీనిని వాడుక భాషలో ముక్కల పండుగ అని పిలుస్తారు. ఈ రోజున గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, ఆపై బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారం. శాస్త్రపరంగా దీనికి అభ్యంతరం లేదు కాబట్టి, పల్లెల్లో ప్రతి ఇంటా ముక్కనుమ విందు ఘనంగా జరుగుతుంది.

News January 17, 2026

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు యువతి

image

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు బి.క్యాంప్‌కు చెందిన శ్రీహిత ఎంపికైనట్టు శిక్షకులు పాలు విజయకుమార్, బ్రహ్మ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈనెల 21న నుంచి 28వ తేదీ వరకు మణిపూర్‌లో జరిగే అండర్-19 ఎస్జీఎఫ్ఐ ఫుట్‌బాల్ పోటీలలో శ్రీహిత పాల్గొంటుందని పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో ఎమ్మిగనూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు.