News March 4, 2025
కాకినాడ: MLCగా గెలిచిన రాజశేఖరం నేపథ్యం ఇదే..!

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం స్వగ్రామం కోనసీమ జిల్లాలోని జి.వేమవరం. తొలుత ఆయన కాంగ్రెస్ ఎంపీటీసీగా, అనంతరం టీడీపీ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు. ఆక్వా వ్యాపారం చేసే రాజశేఖరం ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. BA పూర్తిచేసిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న రాజశేఖరానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.
Similar News
News December 12, 2025
డిసెంబర్ 12: చరిత్రలో ఈ రోజు

1884: తెలుగు భాషాభిమాని సి.పి.బ్రౌన్ మరణం
1911: కోల్‌కతా నుంచి ఢిల్లీ భారతదేశ రాజధానిగా మార్పు
1931: సినీ నటి షావుకారు జానకి జననం
1940: NCP చీఫ్ శరద్ పవార్ జననం
1950: సూపర్ స్టార్ రజినీకాంత్ జననం
1981: క్రికెటర్ యువరాజ్ సింగ్(ఫొటోలో) జననం
– కెన్యా జాతీయ దినోత్సవం
News December 12, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 12, 2025
కామారెడ్డి: NCC విద్యార్థిని అభినందించిన ఎస్పీ

భిక్కనూర్ మండలం మాందాపూర్ కౌంటింగ్ సెంటర్‌లో విధుల్లో ఉన్న NCC విద్యార్థితో KMR ఎస్పీ రాజేష్ చంద్ర ఆప్యాయంగా మాట్లాడారు. ఇది తన మొదటి డ్యూటీ అని విద్యార్థి చెప్పగా, అతని అనుభవాన్ని అడిగి తెలుసుకున్నారు. అతనిలో ఉన్న నిబద్ధత ఉత్సాహం పట్ల SP అభినందించారు. మంచి స్ఫూర్తితో పని చేస్తున్నందుకు ధైర్యం, ఉత్సాహం నింపుతూ విద్యార్థిని మెచ్చుకున్నారు.


