News May 7, 2025

కాగిత నుంచి తాండవ జంక్షన్ వరకు పైప్‌లైన్

image

నక్కపల్లి మండలంలో ఏర్పాటు కాబోతున్న బల్క్ డ్రగ్ పార్క్‌కు ఏలేరు కాలువ నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నక్కపల్లి మండలం కాగిత నుంచి తాండవ జంక్షన్ వరకు 15.5 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించనున్నారు. దీనిని జాతీయ రహదారి మీదుగా నిర్మాణం చేయాల్సి ఉన్నందున ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎస్ నరసింహారావు గత నెలలో ఎన్.హెచ్.ఏ.ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు రాసిన లేఖకు శనివారం అనుమతి లభించింది.

Similar News

News February 17, 2026

కుక్కలా నడుస్తుంది.. ఇంజినీర్‌లా ఆలోచిస్తుంది..

image

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో రోబో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. TCS అభివృద్ధి చేసిన ఈ రోబో కుక్కలా నడుస్తుంది. ఇంజినీర్‌లా ఆలోచిస్తుంది. రిస్కీ ప్రాంతాల్లో ప్రమాదాలు, తప్పిదాలను నివారించడమే ఈ ఆవిష్కరణ ఉద్దేశమని కంపెనీ చెబుతోంది. కంప్రెసర్లు, ఎలక్ట్రికల్ ప్యానల్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సమస్యలను, గ్యాస్ లీకేజ్, వెల్డింగ్ లోపాలనూ గుర్తించగలదు. కష్టతరమైన జోన్లలోనూ పని చేస్తుందట.

News February 17, 2026

శుక్ర మౌఢ్యమి ముగుస్తోంది కానీ!

image

ఈరోజుతో శుక్ర మౌఢ్యమి ముగియడంతో శుభకార్యాలు మొదలవనున్నాయి. అయితే ఈ మంచి రోజులు మే 9 వరకు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ కాలంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం. అలాగే మే 4 నుంచి 29 వరకు కర్తరీ దోషం ఉంది. ఈ సమయంలోనూ శుభకార్యాలు చేయరు. దీంతో మే నెలలో గృహారంభం, గృహప్రవేశం వంటి పనులు చేయరాదు. కాబట్టి ఈ లోపు మీ పనులు ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం.

News February 17, 2026

కర్నూలు: అడవిలో మహిళ హత్య.. సంచలన తీర్పు!

image

గోనెగండ్ల మండలం బి.అగ్రహారం గ్రామానికి చెందిన దేవదాసుకు బైలుప్పలకు చెందిన లక్ష్మిని హత్య చేసిన కేసులో సోమవారం జీవిత ఖైదు పడింది. 2021లో మహిళ కనిపించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముద్దాయిని అరెస్ట్ చేసి విచారించారు. కసాపురం సమీప అటవీ ప్రాంతంలో హత్యచేసి శవాన్ని కాల్చినట్లు వెల్లడైంది. కేసును విచారించిన ఆదోని 2వ అదనపు జిల్లా జడ్జి నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధించారు.