News August 13, 2025
కాచిగూడ: ఐక్యతను పెంచేందుకే ‘హర్ ఘర్ తిరంగా’

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ఐక్యత, సమగ్రతను పెంపొందించడానికి ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం చేపట్టినట్లు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం బర్కత్‌పురలో విద్యార్థులతో కలిసి ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీని నిర్వహించారు. గుజ్జ కృష్ణ, ప్రొఫెసర్ డాక్టర్ జె.అచ్యుతాదేవి, నంద గోపాల్ పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
HYD: ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల సప్లై బంద్!

నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసిన మందుల బిల్లులు దాదాపు రూ.80 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ కాకపోవడంతో తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. వెంటనే తమ బిల్లులు చెల్లించకపోతే మందుల సరఫరా పూర్తిగా నిలిపేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
News March 13, 2026
HYD: టిఫిన్‌పై ₹20, చాయ్‌పై ₹5 ఎక్స్‌ట్రా

గ్యాస్ కొరత నగరవాసుల జేబు ఖాళీ చేస్తోందని పలువురు వాపోతున్నారు. నిజాంపేట్‌లోని ఓ హోటల్ వద్ద ‘గ్యాస్ సిలిండర్ షార్టేజ్ అన్ని ఐటమ్స్ మీద ₹20 అదనం’ అని రాసిన ఉన్న ఫొటో SMలో వైరల్ అవుతోంది. ₹40 ఉండే టిఫిన్‌పై పెంచిన ధర 50% కావడం గమనార్హం. నగరవ్యాప్తంగా చాయ్ మీద ₹5 పెంచినట్లు నిర్వాహకుల చెబుతుండటం ధరల పెరుగుదల తీవ్రతను తెలియజేస్తోంది. చాలా చోట్ల టిఫిన్ సెంటర్లు మూసేశారు. మీ ఏరియాలోనూ ధరలు పెంచారా?
News March 13, 2026
HYD: ఫ్యాన్సీ నంబర్లతో భారీగా ఆదాయం

ఖైరతాబాద్ RTA కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకొనేందుకే వాహనదారులు పోటీ పడ్డారు. TG 09 L 0009ను రూ.10,50,000కు, TG 09 L 0007కు రూ.3,19,999, TG 09 L 0005ను రూ.2,00,005కు, TG 09 K 9999ను రూ.1.5 లక్షలకు, TG 09 L 0024ను రూ.1.24 లక్షలకు, TG 09 L 0001ను రూ.లక్షకు దక్కించుకున్నారు. ఈ నంబర్లతో RTA ఆఫీస్‌కు రూ.31,14,730 ఆదాయం వచ్చింది.


