News November 19, 2025
కాజీపేట నుంచి దర్భంగాకు నేడు స్పెషల్ ట్రైన్

కాజీపేట మీదుగా దర్భంగా స్పెషల్ రైలు బుధవారం నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి- దర్భంగా మధ్య నడిచే ఈ ప్రత్యేక రైలు(07999) కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష, గోండియా, రాయపూర్, బిలాస్‌పూర్, రాంచి సహా పలు స్టేషన్లలో ఆగనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఈ రైలును నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Similar News
News January 22, 2026
24న కాకినాడలో జాబ్ మేళా

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయల్ పార్క్, శ్రీ గోపాల్ ఆటోమేటిక్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలలో పనిచేసేందుకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న టెన్త్ నుంచి డిగ్రీ చదివినవారు ఆరోజున ఉదయం10 గంటలకు ధ్రువపత్రాలతో కాకినాడ ఉపాధి కార్యాలయానికి హాజరుకావాలన్నారు.
News January 22, 2026
హరీశ్ రావు ‘ఫోన్’ క్యాపింగ్ నిజమేనా..?

ఫోన్ టాపింగ్ కేసులో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసి విచారించిన విషయం తెలిసిందే. కాగా దాదాపు 7 గంటల పాటు సాగిన ఈ విచారణ సమయంలో మీ ఫోనే ట్యాప్‌కు గురైందని సిట్ అధికారులు హరీశ్ రావుకు వివరించడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సొంత పార్టీ వారి పైనే నిఘా పెట్టారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఫోన్ టాపింగ్‌పై కార్లిటీ రావాల్సి ఉంది.
News January 22, 2026
దెందులూరు: బ్రిడ్జి నిర్మాణంపై చింతమనేని సూచనలు

దెందులూరు నియోజకవర్గంలో నూతన రోడ్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. కొక్కిరపాడు నుంచి దాసరిగూడెం వెళ్లే మార్గం, పెదపాడు మండలంలోని వట్లూరు సహా పలు ప్రాంతాల్లో ఆర్ఓబి, ఆర్ యు బిల నిర్మాణాలు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి సెల్వి, జేసి, తదితరులు పాల్గొన్నారు.


