News March 28, 2024
కాటారం: చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

కాటారం మండలంలోని సుందర్ రాజ్ పేటకు చెందిన విద్యార్థిని అక్షయ(15) చికిత్స పొందుతూ మృతి చెందింది. SI అభినవ్ వివరాల ప్రకారం.. ఈనెల 19న అక్షయ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాసేందుకు ఆమె తండ్రి ప్రవీణ్‌తో కలిసి, బైక్ పై వెళ్తోంది. ఈ క్రమంలో మద్దులపల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. అక్షయ తలకు తీవ్ర గాయాలు కాగా.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
Similar News
News February 10, 2026
1300 మందితో బందోబస్తు: కరీంనగర్ సీపీ

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 1300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ సహా హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండిలో నిఘా పెంచామన్నారు. సున్నిత కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 10, 2026
కరీంనగర్ జిల్లాలో 189 మంది బైండోవర్: సీపీ గౌష్ ఆలం

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కఠినమైన ముందస్తు చర్యలు చేపట్టింది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 189 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేయడంతో పాటు, 49 లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేయించినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. నిబంధనల ఉల్లంఘనపై ఇప్పటివరకు 13 కేసులు నమోదు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో నిరంతరం నిఘా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
News February 10, 2026
కరీంనగర్: ముగిసిన పోలింగ్ సామాగ్రి తరలింపు

కరీంనగర్ నగరపాలక సంస్థ రెండో సాధారణ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి 477 కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి తరలింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పర్యవేక్షణలో 93 బస్సుల్లో సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచే 66 డివిజన్లలోని 3.40 లక్షల మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు.


