News December 3, 2025
కాణిపాకం సేవలు ఇక ఆన్ లైన్ లోనూ…

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ సేవలు ఆన్ లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. దర్శన టికెట్ల బుకింగ్, ఆర్జిత సేవలు, వసతి, ప్రసాదాలను భక్తులు ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఆన్ లైన్ సేవలకు దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. బుకింగ్ కోసం ఆలయ అధికార వెబ్‌సైట్ల ద్వారా సేవలు పొందవచ్చు. లేదా ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 ద్వారా కూడా ఈ సేవలు పొందవచ్చు.
Similar News
News February 19, 2026
శ్రీకాకుళంలో ఎండలు, ఉక్కబోత ప్రారంభం

శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా ఎండలు, ఉక్కబోత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మహాశివరాత్రి తర్వాత రోజుల నుంచి వేడి తీవ్రత మొదలవుతుందని చెబుతున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతుంది. వాతావరణ నిపుణుల ప్రకారం, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
News February 19, 2026
ASF జిల్లాలో 23 పరీక్షా కేంద్రాలు: డీసీవో

సాంఘిక సంక్షేమ, జనరల్ గురుకులాల్లో 5 తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఈనెల 22న పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయ అధికారి శారద తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,847 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఆన్‌లైన్లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు.
News February 19, 2026
ఇండియాలోనూ ఇలాంటి మార్పులు కావాలా?

ఇండియాలోనూ జపాన్ తరహా మార్పులు రావాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దగ్గర పిల్లలు ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్‌కు అలవాటు పడ్డారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం వంటి ముప్పుకు దారితీస్తోందని హెచ్చరిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు జపాన్‌లోని పాఠశాల క్యాంటీన్లలో ప్రాసెస్డ్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను నిషేధించినట్లు తెలిపారు. దీనిపై మీ కామెంట్?


