News March 26, 2024

కామారెడ్డిలో యువకుడి దారుణ హత్య

image

కామారెడ్డి మండలం రామేశ్వర్ పల్లి, ఆరేపల్లి గ్రామాల మధ్య రోడ్డుపై వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఈరోజు ఉదయం గుర్తించారు. అతడు సోమవారం రాత్రి హత్యకు గురైనట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 11, 2026

బోధన్: దొంగ ఓటు వేసేందుకు యత్నం.. ఇద్దరిపై కేసు

image

బోధన్ పట్టణంలోని రాకాసిపేట్, గోశాలలో దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు SHO వెంకట నారాయణ తెలిపారు. రాకాసిపేట్ బూత్ నం 24, గోశాల బూత్ నం 78లోని పోలింగ్ కేంద్రాల్లో ఇద్దరు నిందితులు తప్పుడు గుర్తింపు పత్రాలతో ఓటు వేయడానికి ప్రయత్నించారన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను సదరు వ్యక్తులపై ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

News February 11, 2026

NZB: సర్వం సిద్ధం.. కాసేపట్లో పోలింగ్ ప్రారంభం

image

నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్, మున్సిపాలిటీలలో కాసేపట్లో పొలింగ్ ప్రారంభం కానుంది. నిజామాబాద్‌లోని 60 డివిజన్లకు 488 పొలింగ్ కేంద్రాలు, బోధన్‌లో 38 వార్డులకు 111 కేంద్రాలు, ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 106 పోలింగ్ కేంద్రాలు, భీంగల్ లో 12 వార్డులకు 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొలింగ్ జరగనుంది.

News February 11, 2026

నవీపేట్: ASI పై హత్యాయత్నం.. నిందితుడికి 8 ఏళ్ల జైలు శిక్ష

image

నవీపేట్ సమీపంలో విధుల్లో ఉన్న ఏఎస్ఐ గంగాధర్‌పై ఆటోతో దాడికి పాల్పడిన కేసులో నిందితుడు కాంబ్లె గంగాధర్‌కు ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. నిజామాబాద్ మూడవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇంచార్జీ జడ్జి దుర్గా ప్రసాద్ ఈ తీర్పునిచ్చారు. 2025 జూలైలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరుకుతాననే భయంతో నిందితుడు పోలీసులపైకి ఆటోను దూసుకెళ్లాడు. శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.