News August 22, 2025
కామారెడ్డి: అథ్లెటిక్స్‌లో అదరగొట్టారు..!

కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ మెన్ విభాగంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈనెల 30న మహబూబ్‌నగర్ నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో కామారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని, ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ఇవి దోహదపడతాయన్నారు.
Similar News
News January 19, 2026
24% పెరిగిన ఆటోమొబైల్ ఎగుమతులు

భారత్ నుంచి 2025లో ఆటోమొబైల్ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2024లో 50,98,474 వాహనాల ఎగుమతి జరగ్గా.. గతేడాది ఆ సంఖ్య 63,25,211(24.1%)కు చేరింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో డిమాండ్ బాగా పెరుగుతోంది. ప్యాసింజర్ వాహనాల ఎగుమతి 16%, యుటిలిటీ వెహికల్స్ 32శాతం, కార్ల ఎగుమతులు 3% మేర పెరిగాయి. వీటిలో 3.95 లక్షల యూనిట్లు ఎగుమతి చేసి మారుతీ సుజుకీ అగ్రస్థానంలో నిలిచింది.
News January 19, 2026
గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా నిలుస్తాం: NATO దేశాలు

గ్రీన్‌లాండ్ ప్రజలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, UK దేశాలు జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాయి. ‘ఆర్కిటిక్ రక్షణకు కట్టుబడి ఉన్నాం. మా సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు కలిసి పనిచేస్తాం. టారిఫ్ బెదిరింపులు ట్రాన్స్‌అట్లాంటిక్(US-యూరప్) సంబంధాలను దెబ్బతీస్తాయి. పరిస్థితులు మరింత దిగజారొచ్చు కూడా’ అని అమెరికాను హెచ్చరించాయి.
News January 19, 2026
శభాష్ హర్షిత్ రాణా.. నీపై బాధ్యత పెరిగింది!

NZతో జరిగిన వన్డే సిరీస్‌లో హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన చేశారు. 3 వన్డేల్లో కలిపి 6 వికెట్లు తీసి.. 83 రన్స్ చేశారు. అతను జట్టులో అవసరమా అన్న పరిస్థితి నుంచి జట్టుకు అతని అవసరముంది అనేలా రాణించారు. ట్రోల్స్‌ని పట్టించుకోకుండా ముందుకు సాగారు. కోచ్ గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. అతనికి బ్యాటర్‌గానూ అవకాశాలిస్తే జట్టులో మంచి ఆల్రౌండర్‌గా ఎదిగే ఆస్కారముందని క్రీడా నిపుణులు అంటున్నారు.


