News April 23, 2025
కామారెడ్డి: ఇంటర్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో భిక్కనూర్‌కి చెందిన పూజ (18) సూసైడ్ చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. పూజకు తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వద్దే ఉంటూ చదువుకుంటోంది. పూజ మృతితో భిక్కనూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 17, 2026
రీఫండ్ పేరుతో మోసాలు.. అప్రమత్తంగా ఉండండి: సీపీ

రీఫండ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా సీపీ సాయి చైతన్య సూచించారు. సాయం పేరుతో పంపే ఏపీకే (APK) ఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేయవద్దని, ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దని కోరారు. సందేహాస్పద లింక్‌లు, కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. ఒకవేళ సైబర్ నేరానికి గురైతే తక్షణమే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
News March 17, 2026
NZB: నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకాలు

ఎస్సీ నిరుద్యోగ యువత నుంచి స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈవీ టూ వీలర్, త్రీ వీలర్, సోలార్ పంపు సెట్ల కోసం మార్చి 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులన్నారు. వార్షిక ఆదాయం గ్రామీణులకు రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు మించకూడదన్నారు. https://tgobmms.cgg.gov.in సందర్శించాలన్నారు.
News March 17, 2026
NZB: ఏప్రిల్ 2న జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ: కలెక్టర్

ఏప్రిల్ 2న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలు విధిగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఉదయం 8 గంటలకు సభలు ప్రారంభం అయ్యేలా చూడాలని, షామియానాలు, తాగునీరు సదుపాయాలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల వివరాలను గ్రామ, వార్డుల వారీగా సభలలో వెల్లడించాలని తెలిపారు.


