News November 19, 2025

కామారెడ్డి: ఇళ్ల లక్ష్యాలు పకడ్బందీగా సాధించాలి: కలెక్టర్

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాచారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట్ మండలాల ఎంపీడీవోలతో జరిగిన ఈ సమావేశంలో.. మండలాల వారీగా నిర్మాణాల పురోగతిని తెలుసుకున్నారు. లక్ష్యాలను వంద శాతం చేరుకునేలా ప్రత్యేక చొరవ తీసుకుని, పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవోలకు కలెక్టర్ సూచించారు.

Similar News

News January 19, 2026

VJA: వామ్మో.. పండుగ 3 రోజుల్లో ఇంత తాగేశారా!

image

సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఈ నెల 12 నుంచి 14 వరకు మూడు రోజుల్లో మొత్తం రూ. 38 కోట్ల సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విక్రయాలు రూ. 4 కోట్లు పెరిగాయి. జిల్లాలో జరిగిన కోడిపందేలు, పండుగకు వచ్చిన జనసందోహం ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. జనవరి 15, 16 తేదీల్లో మద్యం డిపోలకు సెలవు కావడంతో విక్రయాలు జరగలేదు.

News January 19, 2026

ట్రంప్‌కు ఈయూ షాక్ ఇవ్వనుందా..!

image

గ్రీన్‌లాండ్ డీల్‌ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్ <<18885220>>విధించడాన్ని<<>> యూరోపియన్ యూనియన్ (EU) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీకార సుంకాలు విధించాలని భావిస్తోంది. ఈయూ చరిత్రలో తొలిసారిగా ‘ట్రేడ్ బజూకా’ను ప్రయోగించాలని ప్లాన్ చేస్తోంది. దీనికి అదనంగా 93 బిలియన్ యూరోల(రూ.9.8 లక్షల కోట్లు) ప్రతీకార టారిఫ్స్ విధించడాన్ని ఈయూ పరిశీలిస్తోందని రాయిటర్స్ ఏజెన్సీ తెలిపింది.

News January 19, 2026

అసలేంటీ ‘ట్రేడ్ బజూకా’!

image

తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు 2023లో ‘ట్రేడ్ బజూకా’(బెదిరింపుల వ్యతిరేక సాధనం-ACI)ను EU అమల్లోకి తెచ్చింది. ఇతర దేశాల ఆర్థిక బెదిరింపులు, బలవంతపు వాణిజ్య పద్ధతుల నుంచి తమ రక్షణ కోసం రూపొందించింది. కౌంటర్ టారిఫ్స్, దిగుమతులపై ఆంక్షలు, యూరోపియన్ మార్కెట్లలోకి ఆయా దేశాల యాక్సెస్‌ను, పెట్టుబడులను నియంత్రించడం, కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా బ్లాక్ చేయడం వంటి పవర్స్ దీనికి ఉంటాయి.