News November 20, 2025

కామారెడ్డి: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, తాడ్వాయి, సదాశివనగర్, దోమకొండ, లింగంపేట్, రామారెడ్డి, బిబిపేట్ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్ <<>>చేసి వివరాలు నమోదు చేయండి.

Similar News

News January 19, 2026

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏయూ విద్యార్థులకు పోటీలు

image

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 24న ఉదయం 10 గంటలకు NSS భవనంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ఆర్ట్స్ కళాశాల పరిధిలోని చిత్రలేఖన విభాగంలో చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తారు. విజేతలకు 26వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని అధికారులు సూచించారు.

News January 19, 2026

సిరిసిల్ల: ‘కోర్సును సద్వినియోగం చేసుకోవాలి’

image

ఎస్సీ స్టడీ సర్కిల్ ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఫౌండేషన్ కోర్సు కరపత్రాలను సోమవారం ఆమె కలెక్టరేట్లో ఆవిష్కరించారు. జిల్లాకు చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ అభ్యర్థులు https://tsstudycircle.co.in వెబ్ సైట్ లో ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 19, 2026

నాగర్‌కర్నూల్: సర్పంచులకు శిక్షణ తరగతులు ప్రారంభం

image

నాగర్‌కర్నూల్‌లో సర్పంచుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రారంభించారు. తొలి విడతలో 120 మంది సర్పంచులకు ఐదు రోజుల పాటు ఈ తరగతులు నిర్వహిస్తారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పాలనాపరమైన అంశాలపై కలెక్టర్ అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.