News September 13, 2025
కామారెడ్డి: కక్షిదారులు కేసులు పరిష్కారం చేసుకోవాలి

కక్షిదారులు తమ కేసులను పరిష్కారం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ సూచించారు. శనివారం కామారెడ్డిలోని జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు. ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకొని కేసులు పెట్టుకోవద్దని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
నిజామాబాద్ జిల్లాలో 54.69 శాతం పోలింగ్

తుది దశ GP ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 12 మండలాల్లోని 165 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
*ఆలూర్ మండలంలో 56.96%
*ఆర్మూర్ – 56.64 %
*బాల్కొండ – 49.08%
*భీంగల్ -58.68 %
* డొంకేశ్వర్ -56.62 %
*కమ్మర్పల్లి -52.96 %
* మెండోరా -58.14 %
* మోర్తాడ్ -51.48 %
*ముప్కాల్ – 52.77%
*నందిపేట్ – 55.41%
*వేల్పూర్ – 51.48%
*ఏర్గట్ల – 55.45%
పోలింగ్ నమోదైంది.
News December 17, 2025
ముధోల్: కెమికల్‌తో సిరా తొలగిస్తూ పట్టుబడ్డ యువకుడు

ముధోల్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద సిరా తొలగిస్తున్న యువకుడిని ఇంటెలిజెన్స్ పోలీసులు పట్టుకున్నారు. నయాబాదికి చెందిన ఆర్బాజుద్దీన్ ఓటు వేసి వచ్చిన మహిళల వేలిపై ఉన్న సిరా గుర్తును కెమికల్‌తో తొలగిస్తుండగా పోలీసులు గమనించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, కెమికల్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగ ఓట్లకు పాల్పడే ప్రయత్నంగా భావిస్తూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
News December 17, 2025
రేణిగుంటకు చేరుకున్న రాష్ట్రపతి

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేణిగుంటకు వచ్చారు. స్థానిక ఎయిర్‌పోర్టులో ఆమెకు గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి సవిత, కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె హెలికాప్టర్‌లో వేలూరులోని బంగారు గుడికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి రేణిగుంటకు చేరుకుని హైదరాబాద్ వెళ్తారు.


