News August 22, 2025
కామారెడ్డి: ‘కలెక్టర్ సార్ మాకు ఇల్లు మంజూరు చేయండి’

‘కలెక్టర్ సార్ మాకు ఇల్లు మంజూరు చేయండి’ అని KMR జిల్లాకు చెందిన ఓ కుటుంబం వేడుకుంటుంది. బిక్కనూర్‌కు చెందిన ఆకుల రాజు కుటుంబం కొన్నేళ్లుగా సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్నారు. రాజు లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. అతనికి ముగ్గురు ఆడపిల్లలు. ఇప్పటికీ సొంతిల్లు లేదని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని వాపోయారు. మండల స్థాయి అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు.
Similar News
News January 19, 2026
నల్గొండ: మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

నల్గొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పరిధిలో మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రుణాల పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ వివరించారు.
News January 19, 2026
గంటా 45 నిమిషాల మీటింగ్ కోసం 6 గంటల ప్రయాణం.. ఏదో ఉంది?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ UAE అధ్యక్షుడు అల్ నహ్యాన్ భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం గంటా 45 నిమిషాల కోసం ఆయన ఆరు గంటలు ప్రయాణించడం గమనార్హం. ఇరాన్ కల్లోలం, సౌదీ-UAE మధ్య యెమెన్ చిచ్చు, గాజా శాంతి చర్చల వంటి ఇష్యూస్ నేపథ్యంలో ఫోన్లో కాకుండా నేరుగా చర్చించేంత బలమైన విషయమేదో ఉందని దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారత్‌ను బలమైన భాగస్వామిగా UAE నమ్ముతోంది.
News January 19, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు నోటీసులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, BRS నేత హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉ.11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు రావాలని అందులో పేర్కొంది. హరీశ్ పాత్రపై ఓ ప్రైవేటు ఛానెల్ ఎండీ స్టేట్‌మెంట్ మేరకు ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన ఈ కేసులో BRS కీలక నేతకు నోటీసులు రావడం సంచలనంగా మారింది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా? అనేది ఆసక్తిగా మారింది.


