News March 31, 2024

కామారెడ్డి: కేకేను అభినందించిన షబ్బీర్ అలీ

image

కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అభినందించారు. ఈ మేరకు ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందచేశారు. 19 సంవత్సరాల తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్ఠంగా తయారైందన్నారు.

Similar News

News February 11, 2026

నిజామాబాద్ జిల్లాలో రెండు గంటల్లో 8.25 శాతం పోలింగ్

image

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) ఓవరాల్ గా 8.25 శాతం పోలింగ్ నమోదైంది. NZB కార్పొరేషన్‌తో పాటు BDN, ARMR, BMGL మున్సిపాలిటీల పరిధిలోని 146 వార్డులకు సంబంధించి 729 పోలింగ్ స్టేషన్లలో 4,95,485 మంది ఓటర్లకు గాను 40,857 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.

News February 11, 2026

నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం పెరిగేనా?

image

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పట్టణ ఓటర్లు ఓటు కోసం తరలివెళ్తారా అనేది అభ్యర్థులను కలవర పెడుతున్న అంశం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపించిన ఉత్సాహం మున్సిపల్ ఎన్నికల్లో కనిపించడం లేదు. 2020లో NZB కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 4,34,701 మంది ఓటర్లకు గాను 2,79,840 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా డివిజన్లు, వార్డుల్లో 80 శాతం పోలింగ్ దాటలేదు.

News February 11, 2026

నిజామాబాద్ జిల్లాలో 2 గంటల్లో పోలింగ్ శాతం ఎంతంటే?

image

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో పోలింగ్ శాతం 15% కూడా దాటలేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై 9 గంటల వరకు నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి 6.49 శాతం, బోధన్ మున్సిపాలిటీలో 14.24 శాతం, ఆర్మూర్ మున్సిపాలిటీలో 11.05శాతం, భీంగల్ మున్సిపాలిటీలో 9.38 శాతం పోలింగ్ నమోదైంది.