News November 19, 2025
కామారెడ్డి: కోడలిని హత్య చేసిన అత్తకు జీవిత ఖైదు

కోడలిపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో నిందితురాలైన అత్తకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ KMR జిల్లా న్యాయమూర్తి CH.VRR వరప్రసాద్ తీర్పు చెప్పారు. నిజాంసాగర్(M) అచ్చంపేటకు చెందిన అంబవ్వ, ఆమె కోడలు కీర్తన(22)ను నిరంతరం వేధించేది. పెట్రోల్‌ను ఆమెపై చల్లి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితురాలికి శిక్ష విధించింది.
Similar News
News January 23, 2026
నెల్లూరు: సాగు మొదలైనా.. భూసార నివేదికలు ఎక్కడ?

జిల్లాలో వరి సాగు దాదాపు 5 లక్షల ఎకరాలకు పైగా జరుగుతోంది. సాగు మొదలై రెండో నెల అవుతున్నా భూసార నివేదికలు రైతన్నలకు అందలేదు. 31,231 నేల పరీక్షలు లక్ష్యం కాగా 30,785 నమూనాలు సేకరించారు. వీటిలో 23,306 శాంపిల్స్ పరీక్షించగా 14,104 SOIL హెల్త్ కార్డ్స్‌ను అందించారు. నేల స్వభావాన్ని అనుసరించి ఎరువుల వినియోగం జరగని పరిస్థితులు వెంటాడుతున్నాయి. మిగిలిన కార్డ్స్ అందించే లోపు సాగు పూర్తయ్యే అవకాశాలున్నాయి.
News January 23, 2026
చెన్నూర్: విద్యార్థులతో జిల్లా కలెక్టర్

విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూరు మండలంలోని కిష్టంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. డిగ్రీ కళాశాలలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు.
News January 23, 2026
ఇంటర్ ప్రాక్టికల్స్ హాల్ టికెట్లు విడుదల: DIEO

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు ఈనెల 24 నుంచి బోర్డు వెబ్‌సైట్ bie.ap.gov.in లో అందుబాటులో ఉంటాయని DIEO & DEC కన్వీనర్ నీలావతి దేవి తెలిపారు. ఈనెల 27 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను విద్యార్థులు మనమిత్ర వాట్సాప్ (+91 95523 00009) ద్వారా కూడా పొందవచ్చు అన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు గమనించాలని తెలియజేశారు.


