News November 19, 2025

కామారెడ్డి: కోడలిని హత్య చేసిన అత్తకు జీవిత ఖైదు

image

కోడలిపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో నిందితురాలైన అత్తకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ KMR జిల్లా న్యాయమూర్తి CH.VRR వరప్రసాద్ తీర్పు చెప్పారు. నిజాంసాగర్(M) అచ్చంపేటకు చెందిన అంబవ్వ, ఆమె కోడలు కీర్తన(22)ను నిరంతరం వేధించేది. పెట్రోల్‌ను ఆమెపై చల్లి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితురాలికి శిక్ష విధించింది.

Similar News

News January 22, 2026

పెద్దపల్లి: దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అర్హులైన దివ్యాంగులు ఉచిత సహాయక ఉపకరణాల కోసం ఈనెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో బ్యాటరీ వీల్‌చైర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేయనుందని తెలిపారు. తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఈ పథకం అమలవుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు గడువులోగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

News January 22, 2026

రుయాలో AI సేవలు ప్రారంభం

image

రోగులకు రియల్ టైమ్‌లో వేగంగా, అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం రుయాలో AI ఆధారిత ‘నెక్స్ట్ జెన్’ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసింది. ఓపీ, ఐపీ, సర్జరీ, ల్యాబ్, రేడియాలజీ, ఐసీయూ, ఫార్మసీ విభాగాలతో ఈ సాంకేతికత అనుసంధానమై పనిచేస్తుంది. ఇకపై ప్రతి రోగికి ప్రత్యేక ఐడీ క్రియేట్ చేసి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌తో అనుసంధానం చేయడం ద్వారా జీవితకాల ఆరోగ్య వివరాలు డిజిటల్‌గా భద్రపరచనున్నారు.

News January 22, 2026

వైద్య రంగంలో సరికొత్త విప్లవం..!

image

ఐఐటీ బాంబే & IIT మండి శాస్త్రవేత్తలు చిన్న రోబోల సహాయంతో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కనిపెట్టారు. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నీటిలోకి వెళ్లి, ఒకేసారి దిశ మార్చుకుంటూ ఎలా ఈదుతాయో ఈ రోబోల ద్వారా విజయవంతంగా గుర్తించారు. జీవుల ప్రాథమిక కదలికలను అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నానో రోబోలు మానవ రక్తనాళాల్లోకి వెళ్లి వ్యాధి ఉన్న చోటే మందులు అందించేలా ప్రయోగాలు చేయనున్నారు.