News November 19, 2025
కామారెడ్డి: కోడలిని హత్య చేసిన అత్తకు జీవిత ఖైదు

కోడలిపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో నిందితురాలైన అత్తకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ KMR జిల్లా న్యాయమూర్తి CH.VRR వరప్రసాద్ తీర్పు చెప్పారు. నిజాంసాగర్(M) అచ్చంపేటకు చెందిన అంబవ్వ, ఆమె కోడలు కీర్తన(22)ను నిరంతరం వేధించేది. పెట్రోల్‌ను ఆమెపై చల్లి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితురాలికి శిక్ష విధించింది.
Similar News
News January 23, 2026
NZB: యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: షబ్బీర్ అలీ

యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. NZB కలెక్టరేట్‌లో విద్యార్థుల కోసం నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ ప్రోగ్రాం (SDIP)లో ఆయన మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని సూచించారు.
News January 23, 2026
దేవాదాయ శాఖ బాపట్ల జిల్లా అధికారిగా నాగయ్య

జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అధికారిగా మల్లవరపు నాగయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాల పరిరక్షణ, అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఆయనను బాపట్ల ముత్తుపల్లి సీతారామ స్వామి వారి దేవస్థానం అనువంశిక ధర్మకర్త శ్రీమాన్ వేదాల తాతాచార్యులు, దేవాదాయ శాఖ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
News January 23, 2026
మెస్సీ మ్యాచ్‌కు CSR నిధులు… ఇరకాటంలో సింగరేణి

TG: నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లు సహా సింగరేణి కార్యకలాపాలపై కేంద్ర బృందం లోతుగా పరిశీలిస్తోంది. కోల్ మైన్ టెండర్ల నిబంధనల వివాదం, అక్రమాలపై ఆరా తీస్తోంది. CSR నిధులపైనా దృష్టి పెట్టింది. ఇటీవల ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో ప్రైవేటు సంస్థ నిర్వహించిన ఈవెంట్‌కు CSR నిధులు వినియోగించారు. ఈవెంట్ కోసం ₹10cr నిధులు వాడినట్లు ప్రకటించడం తెలిసిందే. 3 రోజుల్లో ఈ బృందం కేంద్రానికి నివేదిక అందించనుంది.


