News May 7, 2025
కామారెడ్డి: గిన్నిస్ బుక్‌లో చోటు

కామారెడ్డి జిల్లా కూచిపూడి కళాక్షేత్రం గురూజీ వంశీ ప్రతాప్ గౌడ్ అధ్వర్యంలో కూచిపూడి నేర్చుకున్న విద్యార్థులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఏడుగురు విద్యార్థులను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సన్మానించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లను ఎమ్మెల్యే విద్యార్థులకు అందజేశారు.
Similar News
News February 13, 2026
RDM: ఒకే ఇంట్లో రెండు పదవులు: గెలుపు ‘మేకల’ వారిదే!

రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో మేకల సమ్మయ్య యాదవ్, శారద దంపతులు అరుదైన విజయాన్ని అందుకున్నారు. BRS తరఫున 58వ డివిజన్ నుంచి సమ్మయ్య, 60వ డివిజన్ నుంచి శారద కార్పొరేటర్లుగా గెలిచి హిస్టరీ క్రియేట్ చేశారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ప్రజాప్రతినిధులు ఎన్నిక కావడంతో రామగుండంలో ఈ ‘డబుల్ విక్టరీ’ హాట్ టాపిక్‌గా మారింది. తమ డివిజన్ల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తామని ఈ దంపతులు తెలిపారు.
News February 13, 2026
పామర్రు-విజయవాడ హైవేపై ప్రమాదం.. దుర్మరణం

పామర్రు-విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగంతో వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. హైవేలపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
News February 13, 2026
BIG BREAKING: మెదక్‌లో హంగ్

మెదక్ మున్సిపాలిటీ పరిధిలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. 32వ వార్డు ఏకగ్రీవం అవగా మిగతా వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు అనంతరం బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 2, బీఎస్పీ ఒక స్థానం సాధించాయి. 32 వార్డులు ఉండడంతో ఛైర్మన్ ఎన్నిక కోసం మ్యాజిక్ ఫిగర్ 17 కాగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఛైర్మన్ ఎవరు అవుతారన్న ఉత్కంఠ నెలకొంది.


