News November 19, 2025
కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. బీబీపేట 9.3°C, లచ్చపేట 9.5, గాంధారి 9.6, డోంగ్లి, నస్రుల్లాబాద్ 9.7, బొమ్మన్ దేవిపల్లి, మేనూర్‌లలో 9.8, రామలక్ష్మణపల్లి 9.9, సర్వాపూర్ 10, బీర్కూర్ 10.2, జుక్కల్ 10.5, ఇసాయిపేట,రామారెడ్డి, ఎల్పుగొండ 10.6, పుల్కల్ 11, దోమకొండ 11.1, బిక్కనూర్ 11.3°C నమోదయ్యాయి.
Similar News
News January 23, 2026
BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBA/CFA/CA, MCom, BE/BTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 31వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తును careers@bobcaps.inకు ఈ మెయిల్ చేయాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in/
News January 23, 2026
NZB: యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: షబ్బీర్ అలీ

యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. NZB కలెక్టరేట్‌లో విద్యార్థుల కోసం నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ ప్రోగ్రాం (SDIP)లో ఆయన మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని సూచించారు.
News January 23, 2026
దేవాదాయ శాఖ బాపట్ల జిల్లా అధికారిగా నాగయ్య

జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అధికారిగా మల్లవరపు నాగయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాల పరిరక్షణ, అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఆయనను బాపట్ల ముత్తుపల్లి సీతారామ స్వామి వారి దేవస్థానం అనువంశిక ధర్మకర్త శ్రీమాన్ వేదాల తాతాచార్యులు, దేవాదాయ శాఖ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.


