News November 19, 2025
కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. బీబీపేట 9.3°C, లచ్చపేట 9.5, గాంధారి 9.6, డోంగ్లి, నస్రుల్లాబాద్ 9.7, బొమ్మన్ దేవిపల్లి, మేనూర్‌లలో 9.8, రామలక్ష్మణపల్లి 9.9, సర్వాపూర్ 10, బీర్కూర్ 10.2, జుక్కల్ 10.5, ఇసాయిపేట,రామారెడ్డి, ఎల్పుగొండ 10.6, పుల్కల్ 11, దోమకొండ 11.1, బిక్కనూర్ 11.3°C నమోదయ్యాయి.
Similar News
News January 20, 2026
కరూర్ తొక్కిసలాట.. నిందితుడిగా విజయ్ పేరు?

కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి CBI <<18898953>>విచారణకు<<>> నిన్న రెండోసారి విజయ్ హాజరైన విషయం తెలిసిందే. త్వరలో ఆయన్ను నిందితుడిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఏడీజీపీ, మరో పోలీసు అధికారిపైనా అభియోగాలు మోపే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో CBI ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుందని, అందులో విజయ్ పేరు ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా చనిపోయారు.
News January 20, 2026
రేపు ఖమ్మంలో జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు రేపు( బుధవారం) ఖమ్మంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరాం తెలిపారు. ముస్తఫానగర్‌లోని వీవీసీ డెవలప్మెంట్ సెంటర్‌లో టెలీకాలర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పారు. పదో తరగతి నుంచి డిగ్రీ అర్హత, 18-32 ఏళ్ల వయస్సు గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 20, 2026
విజయ్‌తో పెళ్లి.. త్వరలో క్లారిటీ: రష్మిక

హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటారని జరుగుతున్న ప్రచారంపై హీరోయిన్ రష్మిక ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ‘గత నాలుగేళ్లుగా కొన్ని రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. సరైన సమయం వచ్చినప్పుడే దాని గురించి మాట్లాడుతాను. అప్పుడే నిజం తెలుస్తుంది’ అని చెప్పారు. వచ్చే నెలలో వీరు పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి.


