News March 8, 2025

కామారెడ్డి జిల్లాలో డ్రగ్స్ పట్టివేత

image

అక్రమంగా రవాణా చేస్తున్న 250 గ్రాముల నిషేధిత డ్రగ్, ఆల్ఫాజోలంను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు KMRలో పట్టుకున్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన సురేష్ గౌడ్ అల్పాజోలంను ముగ్గురికి విక్రయిస్తుండగా వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి బైక్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐ స్వప్న, ఎస్ఐ రామ్ కుమార్, విక్రమ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News January 22, 2026

నవజాత శిశువుల్లో ఈ లక్షణాలున్నాయా?

image

శిశువు చేతులు, కాళ్లు చల్లగా ఉండటం, చర్మం పాలిపోయినట్టు లేదా కొద్దిగా నీలం రంగులో కనిపించడం వంటివి పసిపిల్లల్లో జలుబు లక్షణాలు. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉన్నా, ఏడుస్తున్నప్పుడు వేగంగా శ్వాస తీసుకోవడం, తరచుగా తుమ్మడం, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. సమయానికి చికిత్స చేయకపోతే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

News January 22, 2026

కదిరిలో మహిళ ఆత్మహత్య

image

కదిరిలో మున్ని అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నారాయణరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

News January 22, 2026

కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం ఎప్పుడో ?

image

KNR నూతన కలెక్టరేట్ ప్రారంభం మరోసారి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి సీఎం చేతుల మీదుగా ప్రారంభం కావాల్సినా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అద్దె భవనాలు ఖాళీ చేయాలని, వివిధ శాఖల్లో అందుబాటులో ఉన్న భవనాల వివరాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నూతన కలెక్టరేట్ ప్రారంభం మరింత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.