News October 5, 2025
కామారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి.. బీబీపేట 20.5మి.మీ, మాచాపూర్ 13, దోమకొండ 12, ఆర్గొండ 10, బీర్కూర్ 6.8, పిట్లం, నాగిరెడ్డిపేటలో 4.3, లింగంపేట 2.8, సర్వాపూర్ 0.8, హాసన్ పల్లి 0.5మి.మీలుగా రికార్డ్ అయ్యాయి. కాగా ఉదయం నుంచి దట్టమైన మేఘాలు కమ్ముకుని ఆకాశం ఆవరించి ఉంది.
Similar News
News January 16, 2026
KNR: మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్ జిల్లా మైనారిటీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల పోస్టర్‌ను అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆవిష్కరించారు. 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు 6, 7, 8 తరగతుల్లోని మిగులు సీట్ల కోసం FEB 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని 9 సంస్థల్లో ఉత్తమ బోధనతో పాటు IIT/NEET శిక్షణ ఇస్తారన్నారు.పూర్తి వివరాలకు www.tgmreistelangan.cgg.gov.in సంప్రదించాలన్నారు
News January 16, 2026
MBNR:CM పర్యటన..ట్రాఫిక్ మళ్లింపు2/2

1.జడ్చర్ల నుంచి రాయచూర్ వెళ్లే వాహనాలు
→SVS హాస్పిటల్ ముందు నుండి, RTC బస్టాండ్, వన్ టౌన్ చౌరస్తా మీదుగా రాయచూర్ రోడ్డు చేరుకోవచ్చు.
2.నాగర్‌కర్నూల్ నుంచి MBNR టౌన్‌లోకి వచ్చే వాహనాలు
→భూత్పూర్ ఫ్లైఓవర్ క్రింది భాగంలో లెఫ్ట్ తీసుకొని, తాటికొండ మీదుగా మహబూబ్‌నగర్ టౌన్‌లోకి రావచ్చు.
3.కర్నూల్ నుంచి మహబూబ్‌నగర్ వచ్చే వాహనాలు
→NH-44 నందు తాటికొండ మీదుగా మహబూబ్‌నగర్ టౌన్‌లోకి ప్రవేశించవచ్చు.
News January 16, 2026
దేశ రాజధానిలో వికారాబాద్ డోలు దెబ్బ

TG రాష్ట్రం నుంచి 30 మంది ఒగ్గు కళాకారులు ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్-2026లో ప్రదర్శన చేసేందుకు ఎంపికయ్యారు. మన జిల్లా నుంచి 16 మంది ఎంపిక అయ్యారని ఒగ్గు కళాకారుడు బీరప్ప తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రముఖుల సమక్షంలో ప్రదర్శన అవకాశం కల్పించిన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కార గ్రహీత ఒగ్గు రవికి కృతజ్ఞతలు తెలిపారు.


