News December 1, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

* కామారెడ్డిలో అక్రమ కట్టడాలు కూల్చివేసిన మున్సిపల్ సిబ్బంది
* కామారెడ్డి: ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
* బిక్కనూర్: బిఆర్ఎస్ పార్టీలో చేరిన సొసైటీ డైరెక్టర్లు
* బిచ్కుంద: హైమాస్ట్ లైట్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే
* కొనసాగుతున్న రెండో విడత నామినేషన్ దాఖలు
* జిల్లాలో ప్రారంభమైన నూతన వైన్సులు
Similar News
News February 17, 2026
మిర్యాలగూడ: గిరిజన సంప్రదాయంగా కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం

మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఏఐఎస్బీ 1, ఇండిపెండెంట్ ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం అట్టహాసంగా కొనసాగింది. 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దిరావత్ స్వర్ణ కౌన్సిలర్‌గా నేడు జరిగిన ప్రమాణస్వీకారంలో గిరిజన సంప్రదాయ వేషధారణలో వచ్చి ప్రమాణం స్వీకారం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.
News February 17, 2026
రైళ్ల టాయిలెట్ల శుభ్రతకు ఏఐ టెక్నాలజీ

రైళ్లలో అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా టాయిలెట్లు ఉంటాయి. ఈ సమస్య పరిష్కారానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. రిజర్వ్, జనరల్ బోగీల్లోనూ గంటకోసారి శుభ్రం చేసేలా AIని వాడుతోంది. తొలిదశలో 100 రైళ్లలో ప్రారంభించినట్లు చీఫ్ ప్రాజెక్ట్ ఇంజినీర్ లక్ష్మణ్ తెలిపారు. ‘క్లీనింగ్‌కు ముందు, తర్వాత ఫొటోలను మొబైల్ యాప్‌లో సిబ్బంది అప్‌లోడ్ చేయాలి. వాటిలో ఏ మాత్రం తేడా ఉన్నా AI అప్రమత్తం చేస్తుంది’ అని చెప్పారు.
News February 16, 2026
మిర్యాలగూడలో 22 ఏళ్లకే వార్డు కౌన్సిలర్‌గా ఎన్నిక

మిర్యాలగూడ మున్సిపాలిటీలో అతి చిన్న వయసులో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. పట్టణంలోని 26వ వార్డు నుంచి పోదిల నిక్షిత్(22) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 22 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి వెంకన్న ప్రజలకు చేస్తున్న సేవలకు ఆకర్షితులై రాజకీయాలకు వచ్చినట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.


