News August 20, 2025

కామారెడ్డి జిల్లాలో పంట నష్టం ఎంతంటే?

image

కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 3,134.55 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు DAO మోహన్ రెడ్డి Way2Newsతో ఈరోజు తెలిపారు. జిల్లాలోని 2,522 మంది రైతులకు ఈ నష్టం వాటిల్లిందని చెప్పారు. సోయా-2,540 ఎకరాలు, వరి-1,619.15, పత్తి-85, పెసలు-100, మొక్కజొన్న- 97, టమాట, కాకర, బీర- 1.4 ఎకరాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం ఈ నష్టం జరిగిందని, పూర్తిస్థాయి నివేదిక కోసం సర్వే జరుగుతుందని ఆయన తెలిపారు.

Similar News

News January 23, 2026

తిరుపతి: మూడో రోజు 35 మంది గైర్హాజరు

image

తిరుపతి జిల్లాలో JEE మెయిన్స్ పరీక్షలు మూడో రోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తిరుపతి సిటీ కోఆర్డినేటర్ టి.కైలాష్ నాథ్ మాట్లాడుతూ.. మొత్తం 2,111 మందికి గాను 2,076 మంది అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు. 35 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్ష ముగిసింది.

News January 23, 2026

పీఎం శ్రీ పనులు సకాలంలో పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన 20 పాఠశాలల్లో మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత హెచ్ఎంలను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిధులను నాణ్యతతో ఖర్చు చేసి పనులు వేగంగా పూర్తి చేస్తే తదుపరి విడత నిధులు వచ్చే అవకాశముందని తెలిపారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పనులను గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.

News January 23, 2026

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సిద్ధమవ్వండి: జేసీ ఆదేశం

image

జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారులతో గూగుల్ మీట్ ద్వారా మాట్లాడిన ఆయన.. ఫిబ్రవరి 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న పాస్ పుస్తకాల పంపిణీకి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రీ-సర్వే అంశాలనూ వేగవంతం చేయాలన్నారు.