News April 14, 2025

కామారెడ్డి జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన

image

మంత్రి జూపల్లి కృష్ణారావు ఈనెల 15న ఉమ్మడి NZB జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.10.30 గంటలకు KMR జిల్లా కలెక్టరేట్‌లో వ్యవసాయ, సివిల్ సప్లై, తదితర శాఖలపై సమీక్షిస్తారు. అనంతరం ఆయన NZB జిల్లా ఆర్మూర్‌కు చేరుకొని, సన్నం బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేస్తారు. సా. 4 గంటలకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారు. గుండ్ల చెరువుకు మిని ట్యాంక్ బండ్‌గా అభివృద్ధికి పునాది రాయి వేయనున్నారు.

Similar News

News January 21, 2026

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత: జడ్జి సుధారాణి

image

బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని భీమవరం సివిల్ జడ్జి సుధారాణి అన్నారు. బుధవారం ఉండి ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ, ఎక్కడైనా ఇలాంటివి జరిగితే తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఈ సామాజిక రుగ్మత నిర్మూలనకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్.సుధీర్ పాల్గొన్నారు.

News January 21, 2026

SRPT: కందులకు రూ.8వేలు మద్దతు ధర: అదనపు కలెక్టర్

image

నాణ్యమైన కందులకు క్వింటాకు రూ.8,000 మద్దతు ధర చెల్లించనున్నట్లు అదనపు కలెక్టర్ సీతారామరావు తెలిపారు. బుధవారం సూర్యాపేట డాక్టర్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట, తిరుమలగిరి మార్కెట్లలో త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. రైతులు 12 శాతం లోపు తేమ ఉండేలా చూసుకోవాలని సూచించారు.

News January 21, 2026

NLG: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు: ఎస్పీ పవార్‌

image

నల్గొండ జిల్లాలో నేరాల అదుపునకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. బాధితుల ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి, సైబర్‌ నేరాల పట్ల ఉక్కుపాదం మోపాలని సూచించారు.