News August 22, 2025
కామారెడ్డి జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

కామారెడ్డి జిల్లాలో నైరుతి రుతుపవనాల రాక, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలతో భారీ వర్షపాతం నమోదైంది. పది రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. జూన్ 1 నుంచి ఆగస్టు 21 వరకు తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ అంచనా ప్రకారం వాతావరణ కేంద్రం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 16 మండలాల్లో 601-1,500 మి.మీ. మధ్య వర్షపాతం నమోదు కాగా, 9 మండలాల్లో 401-600 మి.మీ మోస్తరు వర్షపాతం రికార్డు అయ్యింది.
Similar News
News January 15, 2026
U19 WC: టాస్ గెలిచిన టీమ్ ఇండియా

అండర్-19 వరల్డ్ కప్‌లో యూఎస్ఏతో మ్యాచులో టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
USA: ఉత్కర్ష్ శ్రీవాస్తవ(C), అద్నిత్, నితీశ్, అర్జున్ మహేశ్, అమరీందర్, సబ్రిశ్, అదిత్, అమోఘ్, సాహిల్, రిషబ్, రిత్విక్
ఇండియా: ఆయుశ్ (C), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, విహాన్, అభిజ్ఞాన్, హర్‌వంశ్, అంబ్రీశ్, కనిశ్ చౌహన్, హెనిల్ , దీపేశ్, ఖిలన్.
* మ్యాచ్ లైవ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో చూడవచ్చు.
News January 15, 2026
RITESలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

RITESలో 7 అసిస్టెంట్ మేనేజర్(HR)పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 27 ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి MBA/PGDBM/PGDM/PGDHRM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40,000-రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com/
News January 15, 2026
తిరుపతి: భయపెడుతున్న టిప్పర్లు

తిరుపతి జిల్లా నుంచి తమిళనాడుకు భారీగా గ్రావెల్, ఇసుక, కంకర తరలిస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం మీదుగా రోజుకు 250 నుంచి 300 వరకు టిప్పర్లు బార్డర్ దాటుతున్నాయి. కొన్ని అనుమతులు లేకుండా, మరికొన్ని నకిలీ బిల్లులతో తరలిస్తున్నారని సమాచారం. పుత్తూరు-చెన్నై మెయిన్ రోడ్డుపై రాత్రి వేళ టిప్పర్లు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఆ మార్గంలో ప్రయాణాలంటేనే అందరూ హడలిపోతున్నారు.


