News August 20, 2025

కామారెడ్డి: ‘జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వేలం’

image

కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నిచర్, కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్లు, టెంట్లు, ఇతర ఇనుప సామగ్రిని వేలం వేయనున్నట్లు SP రాజేశ్ చంద్ర బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 22న ఉ.10 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ వేలం పాట నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు 87126 86115 నంబర్‌ను సంప్రదించాలని ఆయన వెల్లడించారు.

Similar News

News January 24, 2026

సంతాన ప్రాప్తి కోసం రేపు ఏం చేయాలంటే..?

image

సంతాన ప్రాప్తి కోరేవారు రథ సప్తమి రోజు బియ్యప్పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. సూర్య నామాలు స్మరిస్తూ దాన్ని 7 రంగులతో నింపాలి. పద్మం మధ్యలో శివపార్వతులను ఉంచి, పక్కనే తెల్లని వస్త్రంపై సూర్యరథపు ప్రతిమను ఉంచి ఎర్రని పూలతో పూజించాలి. గోత్రనామాలతో సంకల్పం చెప్పుకోవాలి. దాన్ని బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఏడాది పాటు ప్రతి సప్తమికి ఉపవాసం ఉంటూ, సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. తద్వారా ఫలితం ఉంటుంది.

News January 24, 2026

జిల్లా స్థాయి షార్ట్ ఫిలిం పోటీల్లో NGKL జిల్లావాసికి ప్రథమ బహుమతి

image

వనపర్తి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (DLSA) నిర్వహించిన జిల్లా స్థాయి లఘు చిత్రాల పోటీల్లో లింగాల మండలం సురాపూర్ గ్రామానికి చెందిన అతినారపు సాయి సాగర్ మొదటి బహుమతి సాధించాడు. సామాజిక అవగాహన కోసం ఆయన రూపొందించిన చిత్రం న్యాయ నిర్ణేతల ప్రశంసలు పొందింది. బాధ్యతాయుతమైన చిత్రాలను రూపొందించినందుకు సాయి సాగర్‌ను గ్రామస్థులు అభినందించారు.

News January 24, 2026

విశాఖ రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కార్యాలయం మార్పు

image

విశాఖ రైల్వే స్టేషన్ వద్ద రిజర్వేషన్ కౌంటర్‌ను మార్చుతున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జనవరి 26 నుంచి ప్రస్తుత రిజర్వేషన్ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు చెప్పారు. జనవరి 27 నుంచి విశాఖ రైల్వే స్టేషన్ గేట్ నంబర్-2, నంబర్-3 మధ్యగల భవనంలో రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.