News August 22, 2025

కామారెడ్డి: నగ్న వీడియోలతో బ్లాక్ మెయిలింగ్..!

image

కామారెడ్డి టౌన్‌లో పురుషులను పురుషులే నగ్న వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు సమాచారం. పురుషులతో లైంగికంగా కలిసే ఓ ముఠా కామారెడ్డి జిల్లాలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. వారితో లైంగికంగా కలిసినప్పుడు వీడియోలు తీసి, వాటిని వాట్సాప్‌కు పంపి, బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని, మోసపోయామంటూ పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Similar News

News January 23, 2026

RCBని కొనుగోలు చేయనున్న అనుష్క?

image

RCB ఫ్రాంచైజీలో వాటా దక్కించుకోవడానికి విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం ఆమె బిడ్ వేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. రూ.400 కోట్లు వెచ్చించి 3% వాటా కొనాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం కోహ్లీ RCB తరఫున ఆడుతున్నారు. అటు ఈ ఫ్రాంచైజీ కోసం బిడ్ వేస్తానని అదర్ పూనావాలా <<18930355>>ఇప్పటికే<<>> ప్రకటించారు.

News January 23, 2026

మంచిర్యాల: ముగిసిన నూతన సర్పంచులు శిక్షణా తరగతులు

image

ఐదు రోజులుగా కొనసాగిన నూతన సర్పంచుల శిక్షణా తరగతులు ఈరోజు ముగిశాయి. జిల్లా స్థాయిలో నూతన సర్పంచులకు ముల్కల వద్ద స్థానిక కళాశాలలో ఈనెల 19వ తేదీ నుంచి ఈరోజు వరకు శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరంలో సర్పంచులకు గ్రామ పరిపాలన, గ్రామ అభివృద్ధి, ప్రజాపాలన, గురించి శిక్షణ ఇచ్చారు.

News January 23, 2026

రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి ADB జిల్లాకు కాంస్య పతకం

image

నిజామాబాద్ జిల్లాలోని కమ్మరపల్లిలో గత మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర జట్టు కాంస్య పతకం సాధించింది. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు క్రీడాకారులతోపాటు కోచ్ కోట యాదగిరిని ఎస్జీఎఫ్ సెక్రటరీలు వెంకటేశ్, యాకుబ్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు, పలువురు అభినందించారు.