News April 23, 2025

కామారెడ్డి: నెలవారీ నేర సమీక్ష 

image

కామారెడ్డి జిల్లా SP రాజేశ్ చంద్ర జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. SP మాట్లాడుతూ.. పెండింగ్ (అండర్ ఇన్వెస్టిగేషన్)లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమితికి లోబడి ఉండాలని, గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ విషయంలో SOP కూడళ్లలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News March 6, 2026

ఆయిల్ ధరల ప్రభావం జీడీపీపై ఉంటుందా?

image

క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం భారత జీడీపీపై ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ధర 10 డాలర్లు పెరిగిన ప్రతీసారి 0.5% జీడీపీ దెబ్బతింటుందంటున్నారు. ఇప్పటికే ముడి చమురు ధర 10 డాలర్ల వరకు పెరిగిందని.. ఆ ఎఫెక్ట్ జీడీపీపైన ఉంటుందన్నారు. వారం రోజుల్లోనే $69గా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర $78కు పెరిగిందని.. మిడిల్ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగితే అది చమురు ధర $87కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు.

News March 6, 2026

9న ఆదిలాబాద్ ITI కళాశాలలో అప్రెంటిషిప్ మేళా

image

ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 9న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కావున జిల్లాలోని ITI ఉత్తీర్ణులైన విద్యార్థులు https://www.apprenticeshipindia.gov.in/mela Registration ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. శిక్షణ కాలంలో స్టైఫండ్ అందజేస్తామని తెలిపారు.

News March 6, 2026

ట్రంప్‌పై విమర్శలతో విరుచుకుపడిన దుబాయ్ బిలియనీర్

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తల నేపథ్యంలో UAE బిలియనీర్ ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూర్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రాంతాన్ని యుద్ధంలోకి లాగడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ‘బోర్డ్ ఆఫ్ పీస్’కు గల్ఫ్ దేశాలు భారీగా నిధులిచ్చాయని.. ఆ డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. యుద్ధాలు ఉండవంటూనే ఇరాన్ సహా ఏడు దేశాలపై ఆపరేషన్స్ చేశారని మండిపడ్డారు. కాగా ఖలాఫ్ అహ్మద్ UAEలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి.