News October 8, 2025
కామారెడ్డి: పారామెడికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు డీఎంఈ, ప్రిన్సిపాల్ వాల్య పేర్కొన్నారు. DMLT 30 సీట్లు, DECG 30 సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తులు OCT 8 నుంచి 28 వరకు స్వీకరించనున్నట్లు చెప్పారు. https://tgpmb.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, తగు పత్రాలను ప్రభుత్వ వైద్య కళాశాల కామారెడ్డిలో అందజేయాలన్నారు.
Similar News
News January 14, 2026
GNT: కిటకిటలాడుతున్న సరస్ ప్రదర్శన ప్రాంగణం

గుంటూరులో జరుగుతున్న సరస్ మేళా-2026 అఖిల భారత డ్వాక్రా బజారుకు విశేమైన ఆదరణ లభిస్తోంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో సందర్శకులు స్టాళ్లను సందర్శిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన స్టాల్స్ మాత్రమే కాకుండా సందర్శకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ఉత్పత్తులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరిస్తున్నాయని సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 14, 2026
చిత్తూరుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

తవణంపల్లి: తెల్లగుండ్లపల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణం వందలూరు గ్రామానికి చెందిన కే. బుజ్జమ్మ (45) భర్త మురుగయ్యతో కలిసి బైకుపై చిత్తూరుకు వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బుజ్జమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, మురుగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మురుగయ్యను చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.
News January 14, 2026
తాండూర్: స్కూల్‌కు వెళ్లమన్నందుకు సూసైడ్

తాండూర్ మండలం నీలాయపల్లిలోని వడ్డెర కాలనీ చెందిన రుద్ర హనీతేజ (15) చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు మాదారం ఎస్ఐ సౌజన్య తెలిపారు. హనీ తేజ తంగళ్లపల్లి ZPSSలో టెన్త్ చదువుతున్నాడు. డిసెంబర్ 21న స్కూలుకు వెళ్లమని తల్లి మందలించగా ఇంట్లో గడ్డి మందు తాగాడు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.


