News April 22, 2025
కామారెడ్డి: పోషకాహారం తీసులకోవాలి: కలెక్టర్

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం 7వ జాతీయ పోషణ పక్షం నిర్వహించారు. కామారెడ్డి IDOC హాల్‌లో కార్యక్రమం నిర్వహించగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు సరైన పోషకాహారం తీసుకోవాలన్నారు. చిన్నారుల ఆరోగ్యానికి తొలి 1000 రోజులు ఎంతో కీలకమని అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న ఆహారంతో పాటు ఇంటి వద్ద కూడా పోషకాహారం ఇవ్వాలని సూచించారు.
Similar News
News March 7, 2026
నిప్పుల కుంపటిలా నాగర్ కర్నూల్

జిల్లాలో వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో పెంట్లవెల్లి మండలం జటప్రోలులో అత్యధికంగా 38.5°C ఉష్ణోగ్రత నమోదైంది. యంగంపల్లి, తిమ్మాజీపేటలో 38.4°C, ఊర్కొండలో 38.2°C గా రికార్డయ్యాయి. భానుడి భగభగలకు జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News March 7, 2026
సివిల్స్ అభ్యర్థులకు రేవంత్ అభినందనలు.. BRSపై విమర్శలు

TG: సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులకు CM రేవంత్ అభినందనలు తెలిపారు. ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ ద్వారా సాయం పొందిన 20 మంది మంచి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ‘గత ప్రభుత్వం పేదల బిడ్డలు బర్లు, గొర్లు కాసుకొని బతకాలని భావించింది. మన ప్రభుత్వం వారి విద్యకు ప్రాధాన్యం ఇచ్చి IASలు, IPSలుగా ఎదగాలని తోడుగా నిలుస్తోంది’ అని ట్వీట్ చేశారు. వారు TG పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు.
News March 7, 2026
ఫలితాలు విడుదల.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 89 మంది ఎంపిక

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 608 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల మెరిట్ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది. ఇందులో వనపర్తి డివిజన్ నుంచి 44, మహబూబ్ నగర్ డివిజన్ నుంచి 45 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎంపికైన వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో మార్చి 23వ తేదీలోగా సంబంధిత డివిజన్ కార్యాలయాల్లో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని అధికారులు సూచించారు.


