News April 9, 2025
కామారెడ్డి: పోషణ పక్షం పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పోషణ పక్షం పోస్టర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 8 నుంచి 22 వరకు జరగనున్న పోషణ పక్షంలో రోజువారీ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వాటిని జన్ ఆందోల్ డ్యాష్ బోర్డులో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల పాల్గొన్నారు.
Similar News
News April 23, 2025
ఇంటర్ ఫలితాల్లో చివరన నిలిచిన మహబూబాబాద్ జిల్లా

మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా ఉత్తీర్ణత శాతంలో చాలా వెనుకబడింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో 48.43 శాతం ఫలితాలు సాధించి రాష్ట్ర వ్యాప్తంగా 33వ స్థానం సాధించి చివరి స్థానంలో నిలిచింది. రెండో సంవత్సరం ఫలితాల్లో 63.68 శాతం ఫలితాలు సాధించి 29వ స్థానంలో నిలిచింది. జిల్లాలో విద్యారంగంపై అధికారులకు శ్రద్ధ లేకపోవడం వల్లే చివరణ నిలిచిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
News April 23, 2025
సత్యసాయి శత జయంతికి రూ.100 నాణెం

శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు వచ్చే ఏడాది నవంబర్ 23 నాటికి పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో రూ.100 నాణేన్ని విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 44mm చుట్టుకొలత, 35 గ్రాముల బరువు ఉండే ఈ నాణెంలో 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ ఉంటుంది. ఒకవైపు అశోక స్తంభం, మరోవైపు సత్యసాయిబాబా చిత్రం, 1926 నంబర్ ఉంటుంది.
News April 23, 2025
వరంగల్ చపాటా అంటే నర్సంపేటనే..!

చపాటా మిర్చి పంట సాగుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పెట్టింది పేరు. కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగయ్యేది నర్సంపేట నియోజకవర్గంలో మాత్రమే. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ చపాటా మిర్చిని మొదట నల్లబెల్లికి చెందిన రైతులు సాగు చేశారు. తర్వాత నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ తదితర మండలాల్లోని రైతులు ఈ రకం మిర్చి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు వచ్చింది.