News March 24, 2024
కామారెడ్డి: బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు

జహీరాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సెన్సార్ బోర్డు సభ్యుడు కామారెడ్డి జిల్లాకు చెందిన అతిమాముల రామకృష్ణా గుప్త.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీలో చేరారు. కేంద్రంలో మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరినట్లు తెలిపారు.
Similar News
News December 7, 2025
NZB: 2వ విడతలో 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం

2వ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. ధర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్ వాయి, NZB రూరల్ మండలాల్లో 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జక్రాన్ పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 158 సర్పంచ్ పదవుల కోసం 587 మంది బరిలో నిలిచారన్నారు.
News December 7, 2025
NZB:16 కిలోమీటర్ల LT కండక్టర్ వైరు చోరీ

నిజామాబాద్ శివారులోని గూపన్‌పల్లి ప్రాంతంలో TSNPDCLకు సంబంధించిన LT కండక్టర్ వైర్‌ను దుండగులు దొంగిలించినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. అశోక వెంచర్ LOB ఎలక్ట్రిసిటీ అధికారులు పరిశీలించగా SS 55/25 నుంచి SS 56/25 వరకు KVDRల నుంచి సుమారు 16 కిలోమీటర్ల LT కండక్టర్ వైర్‌ను కత్తిరించినట్లు గుర్తించారు. దీంతో ఎలక్ట్రిసిటీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SHO పేర్కొన్నారు.
News December 6, 2025
స్ట్రాంగ్ రూమ్‌ను తనిఖీ చేసిన NZB కలెక్టర్

NZB సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎన్నికల సామగ్రిని భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లకు పంపిస్తున్న పోలింగ్ మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. సామగ్రి తరలింపు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జడ్పీ సీఈవో సాయగౌడ్ పాల్గొన్నారు.


