News October 5, 2025
కామారెడ్డి: భారీ వర్షాలు.. కలెక్టర్ ఆకస్మిక పర్యటన

కామారెడ్డిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను అప్రమత్తం చేశారు. గతంలో ముంపునకు గురైన జీఆర్ కాలనీలో ఆదివారం మున్సిపల్ కమిషనర్, ఇతర రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి ఆయన పర్యటించారు. జీఆర్ కాలనీ బ్రిడ్జి వద్ద నీటి ఉద్ధృతిని ఆయన పరిశీలించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News January 20, 2026
బాపట్ల: 25న జిల్లా స్థాయి వెటరన్స్ బ్యాడ్మింటన్ పోటీలు

జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25న పర్చూరులో జిల్లా స్థాయి వెటరన్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి పి.విజయకృష్ణ తెలిపారు. 35 నుంచి 70 ఏళ్ల మధ్య వివిధ విభాగాల్లో స్త్రీ, పురుషులకు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 23వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు అసోసియేషన్ ప్రతినిధులను సంప్రదించాలన్నారు.
News January 20, 2026
RR: బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్‌టాప్స్‌కు అప్లై చేసుకోండి

PWDs సాధికారత, లబ్ధికోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా మహిళలు, శిశువులు, దివ్యాంగులు & వృద్ధుల సంక్షేమ అధికారి శ్రీలత తెలిపారు. దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, ట్రై సైకిల్స్, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ మొదలైన సహాయ ఉపకరణాలను అందిస్తామన్నారు. జనవరి 21 నుంచి జనవరి 30వ తేదీలోపు OBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలని సూచించారు.
News January 20, 2026
మంచిర్యాల జిల్లాలో పలువురు ఇన్‌స్పెక్టర్‌లు బదిలీ

మంచిర్యాల జిల్లాలోని పలువురు ఇన్‌స్పెక్టర్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మల్టీజోన్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌లో పనిచేస్తున్న రమేశ్ మందమర్రికి, మందమర్రి నుంచి శశిధర్ హైదరాబాద్ మల్టీ జోన్‌కు బదిలీ అయ్యారు. RGMలీగల్ సెల్‌లో పనిచేస్తున్న కృష్ణ చెన్నూర్ రూరల్ (కోటపల్లి)కి, రూరల్‌లో పనిచేస్తున్న బన్సీలాల్ చెన్నూర్ టౌన్‌కు బదిలీ అయ్యారు. చెన్నూర్ SHO దేవేందర్ రావు మల్టీ జోన్‌కు బదిలీ అయ్యారు


