News September 10, 2025

కామారెడ్డి: మద్యం మత్తులో మాజీ సర్పంచ్ హల్చల్

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ బార్‌లో మద్యం మత్తులో మాజీ సర్పంచ్ హల్చల్ చేశాడు. ఫుల్లుగా తాగి బార్ సిబ్బందిపై దాడి చేశాడు. భయపడి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి మాజీ సర్పంచ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. అనంతరం, బార్ సిబ్బంది ఆయనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Similar News

News December 9, 2025

ఎస్సారెస్పీ నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల

image

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు యాసంగి పంటల ఆయకట్టుకు నీటి విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ అధికారి జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 3న స్విసువాం కమిటీ నిర్ణయం ప్రకారం ఈనెల 24 వరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ, సరస్వతి, లక్ష్మి కాలువల ద్వారా ఈ సంవత్సరం యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేస్తునట్లు తెలిపారు. వార బంది పద్ధతిలో నీటి విడుదల కొనసాగుతుంది.

News December 9, 2025

జగిత్యాల: పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలకు మాత్రమే సెలవులు

image

జిల్లాలో ఈ నెల 11 నుండి 17 వరకు విడతల వారీగా జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలకు మాత్రమే సెలవులు ఉంటాయని కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10 – 11 వరకు మొదటి విడత, 13 -14 వరకు రెండో విడత, 16-17 వరకు ఎన్నికలు ఉంటాయని, ఆయా గ్రామాల్లోని జరగనున్న ఎన్నికల్లో భాగంగా ఆయా గ్రామాల్ల పోలింగ్ కేంద్రాల్లో 2 రోజులు సెలవులు ఉంటాయని ఉత్తర్వులు పేర్కొన్నారు.

News December 9, 2025

సిరిసిల్ల: ‘ప్రభుత్వ వైద్య సేవలు విస్తృతంగా అందించాలి’

image

ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతంగా అందించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ పని తీరుపై జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంచార్జి కలెక్టర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
గర్భిణీల ఏ.ఎన్.సీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.