News August 20, 2025
కామారెడ్డి: యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి.. జైలు శిక్ష

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, ఓ వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్‌కు 9నెలల జైలు శిక్ష, రూ.1500 ఫైన్ విధిస్తూ కామారెడ్డి కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. భిక్కనూర్ వాసి ముత్త గౌడ్‌ను స్వామి ఆటోతో ఢీకొట్టగా చికిత్స పొందుతూ మరణించాడు. స్వామిని కోర్టులో హజరుపరచగా మెజిస్ట్రేట్ కోర్టు శిక్ష విధించింది. దీనిపై స్వామి జిల్లా కోర్టులో అప్పీల్ చేశాడు. జిల్లా కోర్టు విచారణ జరిపి కింది కోర్టు తీర్పును సమర్థించింది.
Similar News
News January 23, 2026
మరణం లేని యోధుడు నేతాజీ!

మాటలతో కాకుండా పోరాటంతోనే స్వతంత్రం వస్తుందని నమ్మిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ‘నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను’ అంటూ దేశాన్ని కదిలించారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’తో బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్‌లో ఏర్పాటుచేశారు. 1945 ఆగస్టు 18న బోస్ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. కానీ ఆయన మరణం మిస్టరీగా మిగిలిపోయింది. ఇవాళ నేతాజీ జయంతి.
News January 23, 2026
నారా లోకేశ్‌కు Jr.NTR బర్త్‌డే విషెస్

AP: మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది లోకేశ్‌కు అద్భుతంగా సాగాలని హీరో Jr.NTR ఆకాంక్షించారు. ఆయనకు మరింత శక్తి, సుఖసంతోషాలు కలగాలని Dy.CM పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న నేత అంటూ హోంమంత్రి అనిత, మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురు ప్రముఖులు లోకేశ్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.
News January 23, 2026
గురుకుల ప్రవేశాల గడువు 25 వరకు పొడిగింపు

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా బీసీ గురుకులాల ఆర్సీఓ స్వప్న తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.


