News May 7, 2025

కామారెడ్డి: రజతోత్సవ సభకు వేలాదిగా తరలి రావాలి: బీఆర్ఎస్

image

ఈ నెల 27 వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ 25వ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బహిరంగ సభకు లక్ష మందిని తరలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హనుమంత్ షిండే ఉన్నారు.

Similar News

News February 10, 2026

నెల్లూరు: వ్యవసాయ పరికరాలు ఈసారైనా..?

image

జిల్లా ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైనది. అయినా రెండేళ్ల నుంచి రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన కింద యంత్ర పరికరాలు మంజూరు కాలేదు. ఫలితంగా దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువైన వరికొత మిషన్లు, డ్రోన్లు వంటి 1452 రకాల పరికరాలు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు డ్రోన్లుకు ఇప్పటికే దరఖాస్తులు వచ్చినా నిధులు లేమి వేధిస్తుంది. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ యాంట్రీకరణకు నిధులు కేటాయిస్తారో.. లేదో చూడాల్సి ఉంది.

News February 10, 2026

అల్లు అర్జున్‌ 42 రూల్స్ అంటూ ప్రచారం.. AA టీమ్ సీరియస్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బ్రాండ్ స్ట్రాటజిస్ట్ <<19101939>>కావేరీ బారువా<<>> చేసిన వ్యాఖ్యలపై AA టీమ్ స్పందించింది. ‘ఇటీవల అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. ఈ ఆరోపణలను మేము సీరియస్‌గా తీసుకున్నాం. బాధ్యులపై పరువునష్టం దావా వేసేందుకు మా లీగల్ టీమ్ సిద్ధమవుతోంది. ఇలాంటి ధ్రువీకరించని సమాచారాన్ని షేర్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం’ అని ప్రకటన విడుదల చేసింది.

News February 10, 2026

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన శస్త్ర చికిత్సలు

image

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సుల్తానాబాద్‌కు చెందిన 50 సంవత్సరాల మహిళకు గర్భాశయం ముఖ ద్వారం వద్ద ఏర్పడిన గడ్డను మంగళవారం సర్జరీ ద్వారా తొలగించినట్లు సూపరింటెండెంట్ డా.శ్రీధర్ తెలిపారు. అలాగే ఓదెలకు చెందిన ఇద్దరు మహిళలకు లాపరోస్కోపిక్ సర్జరీ ద్వారా గాల్ బ్లాడర్ నెక్‌లోని స్టోన్ తొలగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్జరీలో పాల్గొన్న డాక్టర్ల బృందాన్ని ఆయన అభినందించారు.