News September 13, 2025
కామారెడ్డి విజయ డైరీని సందర్శించిన వాకిటి శ్రీహరి

కామారెడ్డిలోని విజయ డైరీని మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. పాల సేకరణలో విజయ డైరీ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. పాడుబడ్డ భవనాలను తొలగించి ఆధునిక సదుపాయాలతో కొత్త నిర్మాణాలను చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్శనలో అధికారులతో చర్చించి అవసరమైన మార్పులు చేపట్టాలని సూచించారు.
Similar News
News December 10, 2025
మద్యం ప్రియులకు షాక్.. 10 మండలాల్లో 3 రోజులు బంద్

స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా యంత్రాంగం డ్రై డే ప్రకటించింది. డిసెంబర్ 11న జరగనున్న పోలింగ్ దృష్ట్యా, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు 10 మండలాల్లో మద్యం, కల్లు దుకాణాలు మూసివేయనున్నారు. DEC 9 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 11న పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు.
News December 10, 2025
గద్వాల: జీపీ ఎన్నికలకు సర్వం సిద్ధం: ఎస్పీ

ఈనెల 11న జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు గద్వాల పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో సిద్ధమయ్యారని ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం గ్రీవెన్స్ హాల్లో సిబ్బందికి ఎన్నికల విధులకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల భద్రత, రూట్ మొబైల్ టీంలు, స్పెషల్ ట్రైనింగ్ ఫోర్స్ చేపట్టాల్సిన పనుల గురించి అవగాహన కల్పించారు.
News December 10, 2025
గ్లోబల్ సమ్మిట్: ఆ విద్యార్థులకే అనుమతి

TG: గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల సందర్శనకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులనే ఇవాళ అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ పాఠశాలలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎంపిక చేస్తారని చెప్పింది. 2PM నుంచి 7PM వరకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. గురువారం నుంచి మిగిలిన రోజుల్లో ఎవరెవరికి ప్రవేశం ఉంటుందనే విషయాన్ని నేడు ప్రకటిస్తామని వెల్లడించింది.


