News October 5, 2025

కామారెడ్డి: సీఎం కాదు.. కటింగ్ మాస్టర్: హరీష్ రావు

image

కాంగ్రెస్ ప్రభుత్వంపై MLA హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిది కేవలం ‘దోచుకునే ప్రభుత్వం’ అని విమర్శించారు. ఆయనను ‘చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్’ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెచ్చిన పథకాలను కటింగ్ పెడుతూ, ఆయన కట్టిన బిల్డింగ్‌లకు రిబ్బన్లు కత్తిరిస్తున్నారని ఆరోపించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యాకేజీ హామీలు గాలికి పోయాయని విమర్శించారు.

Similar News

News January 17, 2026

మంచిర్యాల: బీసీకే మొదటి మేయర్ పీఠం

image

ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద పట్టణంగా గుర్తింపు పొందిన మంచిర్యాల మున్సిపాలిటీలో నస్పూర్‌తో పాటు మరో 8 జీపీలను విలీనం చేసి కార్పొరేషన్‌గా మార్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈ పీఠం ఎవరికి దక్కబోతోందన్న దానిపై ఉత్కంఠ వీడింది. మొదటి మేయర్ పీఠాన్ని BC జనరల్‌కు కేటాయించారు. దీంతో సీటు ఆశించిన జనరల్ అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. మొత్తం 60 డివిజన్లతో ఏర్పాటైన కార్పొరేషన్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందో చూడాలి.

News January 17, 2026

నల్గొండ తొలి మేయర్‌గా ‘ఆమె’

image

నల్గొండ కార్పొరేషన్ మేయర్ పదవి రిజర్వేషన్ ఖరారైంది. ప్రభుత్వం ఈ పదవిని ‘జనరల్ మహిళ’కు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేయడంతో జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డాయి. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

News January 17, 2026

NGKL: రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించండి: సీఎం

image

రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని, మరింత అభివృద్ధి కావాలంటే ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.