News October 7, 2025
కామారెడ్డి: స్థానిక ఎన్నికలు జరుగుతాయా? తీర్పు కోసం వెయిటింగ్

ఎన్నికలంటే కామారెడ్డి జిల్లాలోని గ్రామాలు చర్చలతో సందడిగా ఉండేవి. ఈసారి ఆ హడావుడి, ఉత్సాహం కనిపించడం లేదు. BC రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ఇంకా వెలువడకపోవడంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అయోమయంలో ఆశావహులు ఉన్నారు. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో, తెలియని అనిశ్చితి నెలకొంది. దీంతో గ్రామాల్లో ప్రచారం, ముచ్చట్లు మందగించాయి. కోర్టు తీర్పు వచ్చాకే ఎన్నికల జాతర మొదలయ్యే అవకాశం ఉంది.
Similar News
News January 20, 2026
మెట్రో ఫేజ్-2: కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ లేఖ

TG: ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న మెట్రో ఫేజ్-2కు వీలైనంత త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి CM రేవంత్ లేఖ రాశారు. ఇదే విషయమై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. గతంలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌నూ కలిసినట్లు గుర్తుచేశారు. ఫేజ్-2 నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇద్దరు అధికారులతో కూడిన సంయుక్త కమిటీ ఏర్పాటును CM లేఖలో ప్రస్తావించారు.
News January 20, 2026
నల్గొండ: M. Ed విద్యార్థులకు అలర్ట్

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో M.Ed semester-3 (R-23) రెగ్యులర్‌కు సంబంధించిన పరీక్షల టైం టేబుల్ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి-10 నుంచి ఫిబ్రవరి-23 మధ్య జరుగుతాయి అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని కోరారు.
News January 20, 2026
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ సునీల్ షొరాణ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ఎక్సైజ్, సెబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.


