News May 7, 2025

కామారెడ్డి: స్వచ్ఛంద సంస్థ జాతీయ పురస్కారానికి ఎంపిక

image

వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన తెలుగు రాష్ట్రాల జాతీయ స్థాయి పురస్కారాలు-2025కి కామారెడ్డి రక్తదాతల సమూహ వ్యవస్థాపకుడు, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ బాలు ఎంపికయ్యారు. ఆదివారం గోదావరిఖనిలో జరిగే అవార్డుల ప్రధానంలో బాలు ఆవార్డు అందుకొనున్నారు.

Similar News

News February 13, 2026

కొత్త హెల్త్ పాలసీ.. 12.84 లక్షల మందికి ప్రయోజనం

image

TG: ప్రభుత్వం తీసుకురానున్న <<19121822>>కొత్త హెల్త్ పాలసీ<<>>తో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, పెన్షనర్లు, వారి కుటుంబీకులు 12.84 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ స్కీమ్ అమలు కోసం సీఎస్ ఛైర్మన్‌గా 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటుచేస్తారు. 515 ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల్లో 1,885 రకాల చికిత్సలు వ్యయపరిమితి లేకుండా అందనున్నాయి. 15 రోజుల్లో సీఎం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

News February 13, 2026

NLG: మున్సిపల్ ఫలితాలు.. మధ్యాహ్నానికే స్పష్టత!

image

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో సహా జిల్లాలో ఆరు మున్సిపాలిటీలలో ఎన్నికల ఫలితాలు ఉదయం 8గంటలకు ప్రారంభమై11:30 వరకు పూర్తయ్యే అవకాశముంది. దేవరకొండ, చండూరు, చిట్యాల, నందికొండ, హాలియాలో 20 వార్డులలోపే ఉండడంతో లెక్కింపు ప్రారంభమైన 2 గంటల వ్యవధిలోనే వీటి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ మున్సిపాలిటీ కౌంటింగ్ తుది ఫలితాలు ఉదయం 11:30 గంటలకు వెలువడనున్నాయి.

News February 13, 2026

నల్గొండ: మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం!

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. NLG కార్పొరేషన్ ఓట్లను ఆర్జాలబావిలో, మిర్యాలగూడ, నందికొండ, హాలియా ఓట్లను అవంతిపురంలో లెక్కించనున్నారు. దేవరకొండ, చండూరు, చిట్యాల ఫలితాలను ఎస్ఎల్బీసీ గురుకుల పాఠశాలలో వెల్లడించనున్నారు. అధికారులు పటిష్ట భద్రత మధ్య ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.