News August 13, 2025
కామారెడ్డి: ‘4 నెలల్లో 2,300 కేసుల పరిష్కారం’

ఇటీవల కొత్తగా ఏర్పడిన రాష్ట్ర సమాచార కమిషన్ గత నాలుగు నెలల్లో పెండింగ్‌లో ఉన్న 18,000 కేసులలో 2,300కు పైగా కేసులను పరిష్కరించిందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ మోహ్సినా పర్వీన్ తెలిపారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన RTI అవగాహన సదస్సులో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె RTI చట్టం అమలుపై అధికారులకు ఉన్న సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
Similar News
News March 15, 2026
శ్రీకాకుళం: కాసులు కురిపిస్తున్న మొగలిరేకులు

శ్రీకాకుళంలోని ఉద్దానంలోని “మొగలి” డొంకలు సహజ రక్షణ కవచంలా తీరప్రాంతాన్ని కాపాడటంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు చక్కని ఆదాయం వనరుగా మారాయి. దట్టంగా పెరుగుతూ సహజ రక్షణ గోడగా నిలుస్తూ తీరప్రాంతాన్ని తుపాన్ల నుంచి కాపాడుతున్నాయి. మొగలిరేకులు నుంచి తయారుచేసే అత్తరుకి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో సీజన్లో కొన్ని కుటుంబాలు ఈ అత్తరు తయారిని కుటీర పరిశ్రమగా నిర్వహించి, మంచి ఆదాయం సంపాదిస్తున్నాయి.
News March 15, 2026
నాగర్‌కర్నూల్: ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు

జిల్లాలో పదో తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు. మొత్తం 10,630 మంది విద్యార్థులు హాజరుకాగా, 21 మంది గైర్హాజరయ్యారు. పరీక్షకు రాని విద్యార్థుల వివరాలను సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News March 15, 2026
NGKL: అడవుల్లో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తం

వేసవిలో అటవీ ప్రాంతాల్లో మంటలు వేగంగా వ్యాపిస్తాయని, జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ హెచ్చరించింది. సిగరెట్ ముక్కలు, అగ్గిపుల్లలు పడవేయడం వల్ల భారీ అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు గుర్తు చేశారు. వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రజలు, పర్యాటకులు సహకరించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి అగ్నిప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు


