News May 21, 2024
కారంచేడు: రైలు నుంచి కింద పడి మృతి

కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కప్పరపు మణికంఠ అనే యువకుడు రైలునుంచి జారిపడి దుర్మరణం చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమలేశ్వరుని దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రైలులో వస్తూ గేటు పక్కన కూర్చొని గూడూరు సమీపంలో నిద్ర మత్తులో జారిపడి మణికంఠ మూడు రోజుల క్రితం మృతి చెందాడు. గూడూరు రైల్వే పోలీసులు దర్యాప్తు జరిపి మంగళవారం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
Similar News
News March 9, 2026
ప్రకాశం: ఈతకు వెళ్లి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

ప్రకాశం జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ ఘటన నరసరావుపేటలో జరిగింది. నరసరావుపేట (M) పెట్లూరువారిపాలెంలో స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న కొనకనమిట్ల (M) కాట్రగుంటకి చెందిన మల్లెల అజయ్(19) ఆదివారం NSP కాలువలో ఈతకు వెళ్లాడు. నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. కళాశాల వార్డెన్ ఫిర్యాదుతో నరసరావుపేట SI కిషోర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 9, 2026
ఆటో డ్రైవర్లకు SP సూచనలు

మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆటో డ్రైవర్లకు ఆదివారం సూచనలు చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలన్నారు. నిర్లక్ష్యంగా ఆటో నడపకూడదు, మద్యం సేవించి వాహణాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఆటోకు నంబర్ ప్లేట్ క్లియర్‌గా కనిపించేలా ఉండాలి, పోలీసు నంబర్ కూడా ఉండాలన్నారు.